Security Risk: హై రిస్క్‌లో ఆండ్రాయిడ్ యూజర్లు.. ఏం చేయాలంటే?
- సెర్ట్-ఇన్ కీలక హెచ్చరిక
- హై రిస్క్‌లో ఆండ్రాయిడ్ యూజర్లు
- ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CERT-In Warning for Android Users: ఆండ్రాయిడ్ ఫోన్‌లను వినియోగిస్తున్న వారికి కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా’ (సెర్ట్-ఇన్) కీలక హెచ్చరిక చేసింది. ఆండ్రాయిడ్ ఓఏస్ (ఆపరేటింగ్ సిస్టమ్)లోని కొన్ని వెర్షన్లలో పలు లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవిగా పేర్కొన్న సెర్ట్-ఇన్.. వీటితో సైబర్ నేరగాళ్లు ఫోన్‌లలో సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆండ్రాయిడ్ 12, 12L, 13, 14 కంటే ముందు ఉన్న వెర్షన్‌లు ప్రభావితమవుతాయని సెర్ట్-ఇన్ తమ ప్రకటనలో వెల్లడించింది. ఫ్రేమ్‌వర్క్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్‌లు, కెర్నల్, ఆర్మ్, మీడియాటెక్ మరియు క్వాల్‌కామ్ కాంపోనెంట్‌లలో లోపాల కారణంగా ఈ సమస్యలు వచ్చినట్లు తెలిపింది. వీటిని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్లలో పాస్‌వర్డ్‌లు, ఫొటోలు, ఆర్థిక లావాదేవీల డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగలించే అవకాశముందని సెర్ట్-ఇన్ హెచ్చరించింది. ఈ లోపాల నుంచి ఫోన్‌లను సురక్షితంగా ఉంచుకునేందుకు ఆండ్రాయిడ్ యూజర్లు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
Also Read
- Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
- 1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
- AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
- Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
Also Read: OnePlus Nord 4 Price: లాంచ్ ఈవెంట్‌కు ముందే ధర లీక్.. వన్‌ప్లస్ నార్డ్ 3 కంటే తక్కువ!
అప్‌డేట్ చేసుకోవడానికి.. ముందుగా డివైజ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టమ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సిస్టమ్ అప్‌డేట్‌పై క్లిక్ చేసి.. ఏదైనా అప్‌డేట్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆపై డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సూచనలు పాటిస్తూ దాన్ని అప్‌డేట్ చేసుకోవాలి.
తాజావార్తలు
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
-
BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..