Site icon NTV Telugu

CEO Vikasraj: వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సేవల్లో పనిచేసే వారికి హోమ్‌ ఓటింగ్

Ceo Vikasraj

Ceo Vikasraj

CEO Vikasraj: ఈ సారి సాధారణ ఎన్నికల్లో హోమ్ ఓటింగ్ చేస్తున్నామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. బ్యాలెట్ పేపర్ ముద్రణ జరిగిందని, ఈవీఎం బ్యాలెట్స్ ప్రింట్ కూడా అయ్యాయన్నారు. 36 వేల ఈవీఎంలు సిద్ధం చేశామన్నారు. 51 లక్షల ఎపిక్ కార్డులు ప్రింట్ చేసి పంపిణీ చేస్తున్నామన్నారు. జనరల్, పోలీస్, వ్యయ పరిశీలకులు రాష్ట్రానికి వచ్చారన్నారు. కౌంటింగ్ సెంటర్‌కు ఒకరు చొప్పున కౌంటింగ్ పరిశీలకులు ఉంటారన్నారు. తొలిసారి హోమ్ ఓటింగ్‌ నిర్వహిస్తున్నామని.. 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర విధులు నిర్వహించేవ అధికారులు హోమ్‌ ఓటింగ్‌ను వినియోగించుకోవచ్చని సీఈవో వికాస్‌రాజ్‌ వెల్లడించారు. 9396 మంది వృద్ధులు, 5022 దివ్యాంగులు, 1053 అత్యవసర విధులు నిర్వర్తించే అధికారులు ఓటింగ్ పూర్తి చేశారన్నారు.

Also Read: Revanth Reddy: ఎమ్మెల్యే రసమయికి రేవంత్ రెడ్డి చురకలు

ఓటర్ స్లిప్స్, ఓటర్ గైడ్ లైన్స్ బుక్ లెట్ పంపిణీ చేస్తున్నామని, ఎల్లుండి వరకు ఓటర్ స్లిప్స్ పంపిణీ పూర్తి చేస్తామన్నారు. సర్వీస్ ఓటర్లు 9811 మంది డౌన్లోడ్ చేసుకున్నారని.. 275 ఇప్పటి వరకు పోల్ అయ్యాయని.. ఇంకా సమయం ఉందన్నారు. ఒక నియోజకవర్గంలో 4 ఈవీఎంలు ఉపయోగించబోతున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. 6 నియోజకవర్గాల్లో 500 మించి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని.. దాని కోసం కౌంటింగ్ ప్రక్రియలో తగు మార్పులు ఉంటాయన్నారు. సీ-విజిల్ యాప్ ద్వారా ప్రతీ వాహనానికి జీపీఎస్ అమర్చబడి ఉంటుందని సీఈవో వికాస్‌రాజ్‌ పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఎన్నికల పరిశీలకులు ఉన్నారన్నారు. ఇప్పటివరకు రూ.669 కోట్లు పట్టుకున్నామన్నారు. 260 కోట్ల నగదు, 109 కోట్ల విలువైన లిక్కర్, 35 కోట్ల విలువైన మత్తు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.

 

Exit mobile version