NTV Telugu Site icon

Assam CM: అస్సాం ముఖ్యమంత్రికి ‘జెడ్‌ ప్లస్’ సెక్యూరిటీ.. అందుకేనా?

Himantha Biswa Sarma

Himantha Biswa Sarma

Assam CM: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భద్రతను ‘జెడ్‌ ప్లస్’ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఆయన భద్రతను ఈశాన్య ప్రాంతంలోని ‘జెడ్‌’ కేటగిరీ నుంచి భారతదేశ ప్రాతిపదికన ‘జెడ్‌ ప్లస్’ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం శర్మ ‘జెడ్‌’ కేటగిరీ భద్రతను అందిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇప్పుడు ఆయనకు ‘జెడ్‌ ప్లస్’ కేటగిరీ భద్రతను కల్పిస్తుంది. సీఆర్‌పీఎఫ్‌ దళాలతో సమీక్ష అనంతరం ఆయన భద్రతను ‘జెడ్‌’ నుంచి ‘జెడ్‌ ప్లస్’ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Bombay High Court: మావోయిస్టు లింక్‌ల కేసులో మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నిర్దోషి

‘జెడ్‌ ప్లస్’ కేటగిరీ సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం, అస్సాం ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడికైనా వెళ్లినప్పుడల్లా 50 మందికి పైగా కమాండోలు ఆయన వెంట వస్తుంటారు. హిమంత బిశ్వ శర్మకు 2017లో సీఆర్‌పీఎఫ్ ‘జెడ్‌’ కేటగిరీ భద్రత కల్పించబడింది. మునుపటి భద్రతా ఏర్పాట్ల ప్రకారం.. ‘జెడ్‌’ కేటగిరీ భద్రత రాష్ట్రంలో శర్మకు అందించగా.. ఇప్పటి నుంచి ‘జెడ్‌ ప్లస్’ కేటగిరీ భద్రత అందనుంది.