Covid Guidelines: చైనా, థాయ్‌లాండ్‌తో సహా ఆరు దేశాల ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి చేయడానికి ముందు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇవాళ అంతర్జాతీయ విమానాలలో వచ్చే ప్రయాణీకుల కోసం సవరించిన కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. జనవరి 1, 2023 నుంచి చైనా, సింగపూర్, హాంకాంగ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, థాయ్‌లాండ్, జపాన్ నుంచి వచ్చే అన్ని అంతర్జాతీయ విమానాల్లో వచ్చే ప్రయాణీకులకు ప్రీ-డిపార్చర్ ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టును తప్పనిసరి చేసింది. అంటే ప్రయాణానికి ముందే పరీక్ష చేయించుకోవాలి.
ఎయిర్ సువిధ పోర్టల్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్‌లను సమర్పించిన ఆరు దేశాల నుంచి ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణీకులకు మాత్రమే మార్పులు, బోర్డింగ్ పాస్‌లను జారీ చేయడానికి విమానయాన సంస్థలు తమ చెక్-ఇన్ కార్యాచరణలను సవరించాలని ఆదేశించినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశానికి వచ్చే ఈ అంతర్జాతీయ ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టుతో పాటు స్వీయ-డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాలని వెల్లడించింది. ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి.
World leaders offer condolences: ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల ప్రపంచ నేతల సంతాపం
ప్రతి అంతర్జాతీయ విమానంలో వచ్చే ప్రయాణీకులలో 2 శాతం మందిని యాదృచ్ఛికంగా పరీక్షించే ప్రస్తుత పద్ధతి కూడా కొనసాగుతుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ఈ నిర్ణయాలను తీసుకున్నారు. తాజా అధికారిక సమాచారం ప్రకారం డిసెంబర్ 29న 83,003 మంది అంతర్జాతీయ ప్రయాణీకులు వచ్చారు.