NTV Telugu Site icon

Central Govt: జమ్మూ కాశ్మీర్ ముస్లిం లీగ్‌పై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధింపు

J@k

J@k

వేర్పాటువాద నాయకుడు మస్రత్ ఆలం భట్ నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్‌ ముస్లిం లీగ్ ను కేంద్రం బుధవారం ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా ప్రకటించింది. అంతేకాకుండా.. UAPA చట్టం కింద ఐదేళ్లపాటు నిషేధించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ (మస్రత్ ఆలం వర్గం)’/MLJK-MA UAPA కింద ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా ప్రకటించబడిందని తన పోస్ట్‌లో రాశాడు. భారత దేశం యొక్క ఐక్యత, సార్వభౌమాధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా పనిచేసే ఎవరైనా వదిలిపెట్టబోమని.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయాల్లో పీఎం నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పష్టంగా, నిస్సందేహంగా ఉందని హోంమంత్రి అన్నారు.

Read Also: PM Modi: క్రిస్మస్ రోజున ప్రధాని నివాసాన్ని సందర్శించిన బాలికలు.. వీడియో షేర్ చేసిన మోదీ

ఈ సంస్థకు గతంలో వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ నాయకత్వం వహించగా.. ఆల్ ఇండియా హురియత్ కాన్ఫరెన్స్ కు తాత్కాలిక అధ్యక్షుడు మసరత్ ఆలం నాయకత్వం వహిస్తున్నారు. కాగా.. అతను దాదాపు 13 ఏళ్లుగా కస్టడీలో ఉన్నాడు. ఆలం 2010లో నిరసన క్యాలెండర్‌లను కూడా విడుదల చేశాడు. ఆ తర్వాత PSA (జమ్మూ మరియు కాశ్మీర్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్) కింద అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. జమ్మూ కాశ్మీర్‌ ముస్లిం లీగ్ సభ్యులు జమ్మూ కాశ్మీర్‌లో దేశ వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా.. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంతో పాటు.. ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారు. 2010లో లోయలో జరిగిన స్వాతంత్ర్య అనుకూల నిరసనల ప్రధాన నిర్వాహకుల్లో ఆలం ఒకరు. ఆ నిరసనల తర్వాత అతనితో పాటు ఇతర నాయకులను కూడా అరెస్టు చేశారు. అనంతరం 2015లో విడుదలయ్యాడు. MLJK యొక్క మస్రత్ ఆలం వర్గం ఇప్పుడు UAPAలో పేర్కొన్న షరతులు, జరిమానాలకు లోబడి ఉంది.

Read Also: Harish Rao : ఎప్పుడైనా కాంగ్రెసోళ్లు చెక్ డ్యామ్‌లు కట్టారా