Site icon NTV Telugu

Telangana: సీఎస్ శాంతికుమారితో కేంద్ర బృందం భేటీ

Telangana

Telangana

Telangana: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో సమావేశమైంది. ఈ నెల ఒకటవ తేదీ నుంచి మూడో తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలకు చెందిన ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించింది. కేంద్ర ప్రతినిధి బృందంతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాలు నేడు సీఎస్‌తో సమావేశమయ్యారు.

Also Read: Madhu yaskhi Goud: తెలంగాణ నినాదంతో పదేళ్లుగా కేసీఆర్ దోపిడీ పాలన

ఈ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి మాట్లాడుతూ.. భారీ వర్షాలకు దెబ్బతిన్న ఐదు జిల్లాల్లో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. వీటితో పాటు వరి పంటతో పాటు పత్తి పంట పూర్తిగా ధ్వంసమైందని తాము పరిశీలించినట్టు వివరించారు.

Also Read: HMDA: కోట్లు కురిపించిన కోకాపేట భూములు.. ఎకరం రూ.100 కోట్లు

ప్రధానంగా మోరంచపల్లి, కొండాయి గ్రామాలూ పూర్తిగా నీటమునిగి ఆస్తి నష్టం కలిగాయని అన్నారు. అయితే, ఈ ఐదు జిల్లాల కలెక్టర్లు చేపట్టిన ముంగుజాగ్రత్త చర్యల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా నివారించారని పేర్కొన్నారు. కాగా, విపత్తుల నివారణకుగాను కేంద్ర ప్రతినిధి బృందం చేసిన ప్రతిపాదనలను పరిశీలించగలమని ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.

Exit mobile version