దక్షిణాది ప్రజలకు మేలు చేస్తాం అని, ప్రజల హృదయాలలో చోటు సంపాదించి ఇక్కడ కూడా జెండా ఎగరేస్తాం అని కేంద్రమంత్రి కమ్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో అధికారంలోకి వస్తామన్నారు. దక్షిణ భారతదేశానికి ప్రధాని మోడీ నేతృత్వంలో ఎలాంటి అన్యాయం జరగదన్నారు. ప్రధాని మోడీ పేద కుటుంబం నుంచి వచ్చారని.. పేద ప్రజల గుండె చప్పుడు ఆయనకు తెలుస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన్ కీ బాత్ పూర్తయిన అనంతరం మేధావుల సదస్సు ప్రారభమైంది. ఈ సదస్సులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు.
మేధావుల సదస్సులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ‘రాజ్యాగ రూపశిల్పిగా ఉన్నా సంతోషం లేదని డా.బీఆర్ అంబేద్కర్ అన్నారు. దేశం కులం, మతం పేరిట విడిపోవాలని అంబేద్కర్ కోరుకోలేదు. ప్రజలందరూ కలిసి మెలసి ఉండాలని ప్రయత్నించారు. 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయినపుడు పార్లమెంటు గడపకు శిరసు వంచి నమస్కరించారు, అంబేద్కర్‌ను స్మరించుకున్నారు. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితోనే బీజేపీ ప్రభుత్వం పాలన చేస్తోంది. ముంబైలో అతిపెద్ద విగ్రహం బీజేపీ నిర్మించబోతోంది. పార్లమెంటులో అంబేద్కర్ చిత్రపటం పెట్టారు మోడీ. బ్రతికున్న వాళ్ళందరికీ భారతరత్న ఇచ్చింది కాంగ్రెస్. అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మాత్రమే’ అని అన్నారు.
Also Read: PSR Anjaneyulu: పీఎస్‌ఆర్ ఆంజనేయులను కస్టడీకి తీసుకున్న సీఐడీ!
‘భారతదేశం అనగానే మోడీ కంట్రీ అని అన్ని దేశాలూ అంటున్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో అధికారంలోకి వస్తాం. దక్షిణ భారతదేశానికి మోడీ నేతృత్వంలో ఎలాంటి అన్యాయం జరగదు. దక్షిణాది ప్రజలకు మేలు చేస్తాం.. ప్రజల హృదయాలలో చోటు సంపాదించి ఇక్కడ కూడా జెండా ఎగరేస్తాం. అంబేద్కర్ స్మారక కేంద్రం ఏర్పాటు చేసింది బీజేపీ. 12 కోట్ల టాయిలెట్లు పేద ప్రజల కోసం నిర్మాణం చేశారు మోడీ. ఆయుష్మాన్ భారత్ పేరిట ఒక రక్షణ కల్పించారు మోడీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడే రిలయన్స్, అదానీ, టాటా వచ్చారు. ఆ ముగ్గురి చేతిలో దేశ సంపద ఉందంటాడు రాహుల్ గాంధీ. 75 సంవత్సరాలు దాటిన పెద్దలకు ఉచితంగా ఆయుష్మాన్ భారత్ ఇచ్చారు మోడీ. పేద ప్రజల గుండె చప్పుడు నరేంద్ర మోడీకి తెలుస్తుంది. మోడీ పేద కుటుంబం నుంచీ వచ్చారు.. ఆయన తాతా, నానమ్మ రాజకీయ నాయకులు కాదు. మోడీ గుజరాత్ సీఎం అయ్యాక అభివృద్ధి గురించి మిగతా సీఎంలు తెలుసుకున్నారు. మొదటిసారి మోడీ ప్రధాని అయ్యాక రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన అభివృద్ధి పోటీ వచ్చింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. భారతదేశాన్ని విశ్వగురుగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు మోడీ’ అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
