Site icon NTV Telugu

Arjun Ram Meghwal: చిన్నపిల్లలకు భోగి పండ్ల స్నానం దేశంలో ఎక్కడా లేదు..

Sankranthi

Sankranthi

Central Minister Arjun Ram Meghwal Participated in Sankranthi Celebrations in Visakha: విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో మహాసంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్యర్యంలో నాలుగు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. మహా సంక్రాంతి వేడుకల్లో కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘవాల్ పాల్గొన్నారు.

Read Also: Malladi Vishnu: బెజవాడ సెంట్రల్ సీటు వివాదానికి ఎండ్ కార్డ్

చిన్నపిల్లలకు భోగి పండ్ల స్నానం అనేది దేశం మొత్తం మీద ఎక్కడా లేదని, ఒక ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రమే ఉందని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్‌ మేఘవాల్ తెలిపారు. చిన్న పిల్లలకి బోగి పండ్ల స్నానం చేయించడం చాలా మంచి సంప్రదాయమన్నారు. సంస్కృతి సంప్రదాయాల్లో మన దేశం ప్రపంచంలో ముందుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది మన దేశమేనన్నారు. తల్లి తండ్రులు, అన్నదమ్ములతో ఎలా ఉండాలో శ్రీ రాముడు మనకు నేర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో భజన గీతాలు పాడుతూ కేంద్ర మంత్రి ప్రజలను ఆకట్టుకున్నారు.

 

Exit mobile version