NTV Telugu Site icon

Weather : తెలంగాణలో భారీ వర్షాలు.. తడిసిన మహానగరం!

Rains

Rains

తెలంగాణకు కేంద్ర వాతావరణ శాఖ ఎల్లలో అలర్ట్ ను జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఈ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది.

Also Read : Kiren Rijiju: కొందరు రిటైర్డ్ జడ్జిలు భారత్ కు వ్యతిరేకంగా వ్యవహిస్తున్నారు.. మూల్యం చెల్లించుకోక తప్పదు..

ఈ క్రమంలో ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి తెలంగాణలో పలుచోట్లు భారీ వర్షాలతో పాటు వడగాళ్ల వాన కూడా పడుతుంది. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో వడగాళ్ల వర్షంతో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం కూడా తడిసి పోయింది. తమిళనాడు నుంచి మధ్య ప్రదేశ్ వరకు గల ద్రోణీ ఇప్పుడు దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకు తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా మీదుగా కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read : Orange To Oscars: రామ్ చరణ్ అభిమానులకి ఒక గుడ్ న్యూస్, ఒక బాడ్ న్యూస్…

దీంతో ఇవాళ, రేపు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిస్తే అవకాశం ఉంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్లు సంభవించే అవకాశం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read : Sajjala Sensational Comments lIve: ఎమ్మెల్సీ ఫలితాలపై సజ్జల రియాక్షన్

హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా వాతావరణం కూల్ గా ఉంది. దీంతో పాటు నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ భార్షం పడుతుంది. దీంతో రోడ్ల మీద నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇప్పటికే వర్షంలో నగరంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఆఫీస్ ల నుంచి ఇళ్లకు వెళ్తున్న వారు ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Show comments