NTV Telugu Site icon

Vehicle Registration: కొత్త వెహికిల్స్ రిజిస్ట్రేషన్‌ కోడ్‌ టీఎస్ నుంచి టీజీగా మార్పు.. త్వరలో నోటిఫికేషన్‌..

Ts

Ts

TS to TG: తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ కోడ్‌ మారనుంది. ప్రస్తుతం టీఎస్‌ కోడ్‌తో రిజిస్ట్రేషన్‌ చేస్తుండగా ఇక టీజీగా మారబోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నేడో, రేపో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ వెంటనే రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా, అనంతరం కొత్త కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అవుతాయి. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం టీఎస్‌ కోడ్‌ను టీజీగా మార్చాలని రేవంత్ రెడ్డి నిర్ణయించింది.

Read Also: Bus Accident : గుజరాత్ లో 25అడుగుల లోతులో పడిన బస్సు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

అయితే, కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల 5న రాష్ట్ర సర్కార్ లేఖ రాసింది. రవాణా శాఖ సంయుక్త కమిషనర్‌ పాండురంగ నాయక్‌ ఢిల్లీ వెళ్లి ఉన్నతాధికారులను కలవగా ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ మార్పు కొత్త వాహనాలకే అమలు చేయాలనీ, పాత వాహనాలకు గతరిజిస్ట్రేషన్‌ కోడ్‌ను కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.64 కోట్ల వరకు వాహనాలు ఉన్నాయి. ఇందులో ద్విచక్ర వెహికిల్స్ 73.8 శాతం ఉండగా.. కార్లు 13 శాతంగా ఉన్నాయి.