PM-KISAN : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇక నుంచి ఎకరాకు రూ.8వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM-KISAN : రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్. ఈ నెల 23వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతులకోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున.. మూడు వాయిదాలలో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12 వాయిదాల నగదును రైతులకు అందించగా.. ఇప్పుడు 13వ విడత పీఎం కిసాన్ నగదు కోసం లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉండటంతో ఆ రోజు రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున వేస్తారని సమాచారం. మరోవైపు రైతులు ఈనెల 15లోగా ఈకేవైసీ పూర్తి చేయాలని, ఆధార్ అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈకేవైసీ లేకుంటే 13వ విడత డబ్బులు రావని హెచ్చరిస్తున్నారు.
Read Also: China Explosion : చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. రోజైనా అదుపులోకి రాని మంటలు
Also Read
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- New T20 captain Shreyas Iyer: 'సింహాల్లా ఆడదాం'.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
- Denmark: డెన్మార్క్‌లో అజాన్‌పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. పీఎం కిసాన్ నగదు 6000 వేల నుంచి మరింత పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ నగదును పెంచే యోచనలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. వివిధ మీడియా నివేదికల ప్రకారం ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు అందిస్తున్న వార్షిక ఆర్థిక ప్రయోజనాన్ని రూ. 8వేలకి పెంచే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. 8వేలను అర్హులైన రైతుల ఖాతాలో 4 సమాన వాయిదాలలో పంపిణీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఆర్థికంగా చేయుతనందించేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించి, నేరుగా రైతుల ఖాతాల్లో రూ.6వేలను జమచేస్తోంది.
తాజావార్తలు
-
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
-
Bullet Trains: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
-
New T20 captain Shreyas Iyer: ‘సింహాల్లా ఆడదాం’.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
-
Denmark: డెన్మార్క్‌లో అజాన్‌పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!