NTV Telugu Site icon

Tax Collections: కేంద్ర సర్కార్ కు భారీగా కాసుల వర్షం.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుతో పెరిగిన ఆదాయం

Tax

Tax

కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. కార్పొరేట్ల కంపెనీల నుంచి అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులు గణనీయంగా పెరగడంతో సెప్టెంబర్ నెల మధ్య నాటికే ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 23.51 శాతం పెరిగి 8. 65 లక్షల కోట్ల రూపాయలకుకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా తెలిపింది. సెప్టెంబర్ 16 తేదీ నాటికి నికరంగా 8 లక్షల 65 వేల 117 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నుల రూపంలో వసూలు అయినట్లు వెల్లడించింది. ఇందులో కార్పొరేట్ ఆదాయ పన్ను 4 లక్షల 16 వేల 217 కోట్ల రూపాయల కాగా.. వ్యక్తిగత ఆదాయ పన్ను, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కలిపి 4 లక్షల 47 వేల 291 కోట్ల రూపాయలు వచ్చినట్లు పేర్కొన్నారు.

Read Also: MP Vijayasai Reddy: చంద్రబాబుపై తీవ్ర విమర్శలు.. రాజ్యసభలో విరుచుకుపడ్డ సాయిరెడ్డి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 16 తేదీ నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23.51 శాతానికి పైగా పెరిగాయని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ముందస్తు పన్ను వసూళ్లు సెప్టెంబర్ మధ్య వరకు 3.55 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి.. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వసూలు చేస్తే 2.94 లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే ఇవి 21 శాతం మేర పెరిగినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. సెప్టెంబర్ 16 తేదీ నాటికి వసూలైన 3.55 లక్షల కోట్ల రూపాయల ముందస్తు పన్ను వసూళ్లలో కార్పొరేట్‌ కంపెనీల నుంచి వచ్చిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ 2.80 లక్షల కోట్ల రూపాయలు, వ్యక్తిగత ఆదాయ పన్ను 74, 858 కోట్ల రూపాయలుగా ఉన్నాయని తెలిపారు. ఇక సెప్టెంబర్ 16 వరకు దాదాపు రూ.1.22 లక్షల కోట్ల రీఫండ్‌లను ట్యాక్స్‌ పేయర్స్‌కు ప్రభుత్వం జారీ చేసింది అని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది.

Read Also: Shweta Basu Prasad: పండుగ పూట అద్దం ముందు మైండ్ బ్లాకయ్యే హాట్ ట్రీట్ ఇచ్చిన శ్వేతా బసు ప్రసాద్

Show comments