NTV Telugu Site icon

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. గరిష్ఠ వేతన పరిమితి పెంపు

EPFO: పీఫ్‌ చందాదారులకు గుడ్ న్యూస్. ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి (సీలింగ్) ని పెంచాలని ఈపీఎఫ్‌వో నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. చందాదారుల గరిష్ట వేతన పరిమితిరూ. 21 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ. 15వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ. 21 వేలకు సవరించాలని ఈపీఎఫ్‌వో వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రిటైర్మెంట్ సమయంలో పెద్దమొత్తంలో ఉద్యోగుల చేతికి సొమ్ము అందనుంది. ఈ అంశంపై త్వరలో ఒక కమిటీని వేయనుంది ఈపీఎఫ్‌వో. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కనీస వేతన పరిమితి 21 వేలు కావచ్చు. దీని ప్రకారం ఉద్యోగుల జీతం రూ.6,000 పెరుగుతుంది. అలాగే ఉద్యోగి పీఎఫ్‌లో కంపెనీ ఇచ్చే కంట్రిబ్యూషన్ కూడా పెరుగనుంది. దీంతో ఉద్యోగి పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ అధికంగా లభిస్తుంది.

Read Also: Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థినులకు వేధింపులు?

గరిష్ఠ వేతనం పెంపుపై త్వరలోనే ఓ నిపుణుల కమిటీ వేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రూ.15 వేలు జీతం ఉన్న ఉద్యోగి ఖాతాలో రూ.1 800 పీఎఫ్ కట్ అయితే, జీతం 21 వేలు అయితే, పీఎఫ్ మొత్తం 2530 రూపాయలుకు చేరుతుంది. ఉద్యోగి, యజమాని చెల్లించే వాటాలకు వడ్డీ వర్తిస్తుంది కాబట్టి ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. సభ్యులకు ఈపీఎఫ్ఓ భవిష్య నిధి ఫండ్‌తో పాటు పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తుంది. అలాగే, ఉద్యోగి దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఫ్యామిలీ పెన్షన్, బీమా సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వోలో 6.8 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు. గరిష్ఠ వేతనం పెంచితే మరో 75 లక్షల మంది చేరుతారని భావిస్తున్నారు. 20 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని ఈపీఎఫ్‌వో వర్గాలు తెలిపాయి.
Read Also: Minister KTR: శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

Show comments