Telangana: రామగుండం- మణుగూరు రైల్వే కోల్ కారిడార్ కు కేంద్రం పచ్చజెండా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందు కోసం భూ సేకరణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2, 911 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రస్తుతం బొగ్గును కాజీపేట మీదుగా ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారు. ఈ కొత్త లైన్ నిర్మాణంతో దూరంతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గబోతుంది. పెద్దపల్లి–మణుగూరు రైల్వే లైన్ 207 కిలో మీటర్ల పరిధిలో సింగరేణి కోల్ బెల్ట్లను కలుపుతూ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు.
Read Also: Rathnam : ఓటిటీలోకి వచ్చేసిన విశాల్ యాక్షన్ మూవీ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Also Read
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
కాగా, ఇప్పటికే నాలుగు జిల్లాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లను కూడా గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ లైన్ నిర్మాణం పూర్తైతే ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను సందర్శించడం కూడా ఈజీ అవుతుంది. ప్రస్తుతం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ప్రయాణికులు భద్రాద్రి కొత్తగూడెం వెళ్లాలంటే కాజీపేట మీదుగా తిరిగి పోవాల్సి పరిస్థితి ఏర్పాడింది. కొత్త రైల్వే లైన్ పూర్తైతే పెద్దపల్లి నుంచి నేరుగా ములుగు, భూపాలపల్లి మీదుగా కొత్తగూడెం వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో వందల కిలో మీటర్ల దూరం తగ్గిపోతుంది. దీంతో పాటు ఈ జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి కూడా చెందుతుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఆయా జిల్లాల కలెక్టర్లు తొందరలోనే భూసేకరణ పనులను స్టార్ట్ చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!