Site icon NTV Telugu

Rice: బాస్మతీయేతర బియ్యం ఎగుమతిని నిషేధించిన కేంద్రం… ఈ దేశాలు ఇక పస్తులే

Rice Exports

Rice Exports

Rice: బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా దేశాల్లో బియ్యం సంక్షోభం ఏర్పడనుంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతి చేసే దేశం. ఇక్కడ నుండి బియ్యం యూరోప్, అమెరికా, ఆఫ్రికాతో పాటు ఆసియా ఖండంతో సహా అనేక దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. దేశంలో పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించిందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దేశంలో చాలా మందికి ఆహారం అన్నం మాత్రమే. విశేషమేమిటంటే భారతీయులు బాస్మతీయేతర బియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటారు. బాస్మతీయేతర బియ్యం ఎగుమతి కొనసాగి ఉంటే వాటి ధరలు పెరిగేవి. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ ప్రజలకు ఆహారం అందించడం కష్టంగా మారింది. ఈ కారణంగానే బాస్మతీయేతర బియ్యాన్ని కొద్దిరోజుల పాటు నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Read Also:Kalki 2898 AD Glimpse: పోస్టర్ దెబ్బకి వణికిపోయిన ప్రభాస్‌ ఫాన్స్.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నారు!

నేపాల్, కామెరూన్, ఫిలిప్పీన్స్, చైనాతో సహా చాలా దేశాలకు బాస్మతీయేతర బియ్యం చాలా వరకు భారతదేశం నుండి ఎగుమతి చేయబడుతుంది. ఈ నిషేధం ఎక్కువ కాలం కొనసాగితే ఈ దేశాల్లో బియ్యం కొరత ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నేపాల్ ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఎందుకంటే నేపాల్ భారతదేశానికి పొరుగు దేశం. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్‌లతో సరిహద్దులను పంచుకుంటుంది. తక్కువ దూరం కారణంగా నేపాల్ రవాణాకు తక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. వేరే దేశం నుంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తే ఎగుమతులకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. దీని కారణంగా నేపాల్‌కు చేరుకున్నప్పుడు బియ్యం ధర పెరుగుతుంది. దీని కారణంగా ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది.

Read Also:Petrol Price At AP: పెట్రోల్‌ ధరలు అక్కడే ఎక్కువ.. ఎందుకంటే?

బాస్మతీయేతర బియ్యంపై నిషేధం కారణంగా భారతదేశం నుండి ఎగుమతి అయ్యే బియ్యంలో 80 శాతం దెబ్బతింటుందని చెబుతున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ ఈ చర్య రిటైల్ మార్కెట్‌లో బియ్యం ధరలు తగ్గడానికి దారితీయవచ్చు. అదే సమయంలో.. ఇతర దేశాలలో ధరలు పెరుగుతాయి. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది అన్నం మాత్రమే తింటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతమంది ఆందోళనకు గురవుతున్నారు. గత సంవత్సరం భారతదేశం విరిగిన బియ్యం దిగుమతిని నిషేధించింది.

Exit mobile version