Site icon NTV Telugu

Police Medals: 34 మంది తెలంగాణ పోలీసులకు కేంద్ర సేవా పతకాలు

Police Awards

Police Awards

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 954 మంది పోలీసులకు పోలీస్‌ సేవా పతకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 229 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 642 మందికి పోలీసు సేవా పతకాలు అందించనుంది. ఇక, తెలంగాణ రాష్ట్రం నుంచి 34 మంది ఎంపిక అయ్యారు. ఏపీ నుంచి 29 మంది పోలీసులకు ఈ పతకాలు దక్కాయి. ఏపీ నుంచి ఒక్కరికి రాష్ట్రపతి పోలీస్‌ విశిష్ఠ సేవా పతకం, 18 మందికి పోలీస్‌ గ్యాలంటరీ పతకాలు, 10 మందికి విశిష్ఠ సేవా పతకాలు అందించనున్నారు.

Read Also: Sai Rajesh : చిరంజీవి పై వస్తున్న ఆ రూమర్స్ ను ఖండించిన బేబీ దర్శకుడు..

ఇక, తెలంగాణ రాష్ట్రానికి చెందిన 22 మందికి పోలీస్‌ గ్యాలంటరీ, పది మందికి పోలీస్‌ సేవా పతకాలు, మరో ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు అందించనున్నారు. తెలంగాణ అదనపు డీజీ విజయ్‌ కుమార్‌, ఎస్పీ మాదాడి రమణ కుమార్‌లకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలను కేంద్ర ప్రభుత్వం అందజేయనుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ గ్యాలంటరీ పతకాలు పొందిన 22 మంది వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also: Fanism at Peaks: ఇదెక్కడి అరాచకం అయ్యా.. పునీత్, ఎన్టీఆర్ ఫాన్స్ ఏం చేశారో చూస్తే తట్టుకోలేరు?

ఎస్పీ భాస్కరన్, ఇన్ స్పెక్టర్లు శివప్రసాద్, పురుషోత్తంరెడ్డి, ఆర్ఐ రమేష్, ఎస్సై బండారి కుమార్, ఆర్ఎస్ఐలు మహేశ్, షేక్ నాగుల్ మీరా, హెడ్ కాన్ స్టేబుళ్లు ఆదినారాయణ, అశోక్ లకు గ్యాలంటరీ పతకాలు పొందారు. గ్యాలంటరీ పతకాలు పొందిన వారిలో కాన్‌స్టేబుళ్లు సందీప్ కుమార్, కార్తీక్, మధు, సంపత్, దివంగత సుశీల్, సునీల్‌ కుమార్, సుకుమార్, కళ్యాణ్ కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్ రమేష్, మహేందర్ రావు, శివకుమార్ లు ఉన్నారు.

Read Also: Operation Valentine : వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ టైటిల్ అదిరిందిగా..

బండి వెంకటేశ్వర రెడ్డి, అదనపు ఎస్పీ, మిశెట్టి రామకృష్ణ ప్రసాద్ రావు, అదనపు ఎస్పీ ఆత్మకూరి వెంకటేశ్వరి, అదనపు ఎస్పీ ఆందోజు సత్యనారాయణ, ఆర్ఎస్ఐ కక్కెర్ల శ్రీనివాస్, ఆర్ఎస్ఐ మహంకాళి మధు, ఆర్ఎస్ఐ అజెల్ల శ్రీనివాస రావు, ఆర్ఐ రసమోని వెంకటయ్య, సీనియర్ కమాండో అరవేటి భాను ప్రసాద్ రావు, ఇన్ స్పెక్టర్, హైదరాబాద్ సాయన వెంకట్వార్లు ఉన్నారు.

Exit mobile version