Central Election Commission: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేటితో ముగియనుంది.. ఈ నెల 8వ తేదీన విజయవాడ చేరుకుంది కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం విజయవాడ చేరుకుంది.. తొలి రోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేవు.. కానీ, రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం.. వివిధ రాజకీయ పార్టీలకు సమయం కేటాయించింది ఈసీ.. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, సీపీఎం, ప్రజాశాంతి పార్టీ.. ఇలా వరుసగా అన్ని పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసి.. తమ అభ్యంతరాలను, కొన్ని ఫిర్యాదులు చేశారు.. ఇక, మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్‌ఎస్‌ఆర్–2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం సమీక్షించారు..
Read Also: IND vs ENG Test: విద్యార్థులకు శుభవార్త.. ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ ఫ్రీ!
ఇక, మూడో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్‌తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉండనుంది.. ఏపీ సీఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీఐ ఉన్నతాధికారులు సమావేశంకానున్నారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ పర్యటన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బృందం వివరించనుంది.. దీంతో.. ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని బృందం పర్యటన ముగియనుంది.. ఓటర్ల జాబితాలో తప్పులు, ఫేక్ ఓటర్లపై అధికార ప్రతిపక్ష నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో.. కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.