Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- అన్నదాతలకు గుడ్‌న్యూస్
- ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర పెంపు
- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నదాతల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు ఎల్‌నినో.. ఇంకోవైపు తీవ్ర వర్షాభవ కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో మోడీ సర్కార్ తీపి కబురు చెప్పింది. 2027-28 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించిన ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర (MSP)ను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం మంత్రివర్గం సమావేశం అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం ఆరు పంటల MSPలను పెంచగా.. ఇందులో అత్యధికంగా కుసుమ (Safflower) పంటకు క్వింటాల్‌కు రూ.675 పెంచింది.
ఏ పంటకు ఎంత పెంపు?
కుసుమ తర్వాత రాప్సీడ్, ఆవాలు (Rapeseed & Mustard) MSPను క్వింటాల్‌కు రూ.413 పెంచింది. మసూర్ పప్పు MSP రూ.390, బార్లీ రూ.136, శనగ రూ.83, గోధుమ MSP రూ.25 చొప్పున పెరిగింది.
Also Read
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
కొత్త MSPలు ఇలా ఉన్నాయి:
గోధుమ: రూ.2,585 నుంచి రూ.2,610
బార్లీ: రూ.2,286
శనగ: రూ.5,958
మసూర్ పప్పు: రూ.7,390
రాప్సీడ్, ఆవాలు: రూ.6,613
కుసుమ: రూ.7,215
అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయంతో పోలిస్తే కొత్త MSPల ద్వారా రైతులకు గణనీయమైన మార్జిన్ లభిస్తుందని కేంద్రం తెలిపింది. గోధుమపై ఉత్పత్తి వ్యయానికి 106 శాతం, రాప్సీడ్, ఆవాలపై 96 శాతం, మసూర్‌పై 92 శాతం, శనగపై 59 శాతం, బార్లీపై 58 శాతం, కుసుమపై 50 శాతం మార్జిన్ ఉంటుందని అంచనా వేసింది.
2018-19 కేంద్ర బడ్జెట్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే MSPలను సవరించినట్లు ప్రభుత్వం తెలిపింది. అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయానికి కనీసం 1.5 రెట్ల స్థాయిలో MSP ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా పప్పుధాన్యాలు, నూనెగింజల MSPలను పెంచడం ద్వారా రైతులు పంటల వైవిధ్యీకరణ వైపు మళ్లేలా ప్రోత్సాహం లభిస్తుందని కేంద్రం తెలిపింది.
2014-15 నుంచి 2025-26 మధ్య కాలంలో గోధుమ రైతులకు MSP కింద ప్రభుత్వం రూ.7.31 లక్షల కోట్లు చెల్లించినట్లు తెలిపింది. 2004-05 నుంచి 2013-14 మధ్య ఈ మొత్తం రూ.2.56 లక్షల కోట్లుగా ఉంది. అదే సమయంలో ఆరు రబీ పంటలకు కలిపి MSP చెల్లింపులు కూడా గణనీయంగా పెరిగాయి. 2014-15 నుంచి 2025-26 మధ్య కాలంలో మొత్తం రూ.8.36 లక్షల కోట్లు చెల్లించగా.. అంతకుముందు పదేళ్ల కాలంలో ఈ మొత్తం రూ.2.65 లక్షల కోట్లుగా ఉందని కేంద్రం వెల్లడించింది.

తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!