NTV Telugu Site icon

Ashwini Vaishnav: సిమ్ కార్డ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌.. టార్గెట్ అదే..!

Sim

Sim

ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్న విషయం తెలిసిందే.. ఫేక్ ఐడీలతో మోసగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పటినుంచి సిమ్ కార్డ్ డీలర్లకు పోలీసుల వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ గురువారం వెల్లడించారు. మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి బల్క్ కనెక్షన్ల సదుపాయాన్ని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాలు, మోసపూరిత ఫోన్ కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా.. బల్క్ సిమ్ కార్డు కనెక్షన్లు ఇవ్వడంపై కూడా ఆంక్షలు విధించింది.

New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి

ప్రస్తుతం కొంతమంది సిమ్ డీలర్లు వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా సిమ్ కార్డులను విక్రయిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఇకపై అలా జరగకుండా.. సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మరోవైపు వెరిఫికేషన్ తర్వాత వారు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని.. అలా చేయని ఎడలా వారికి రూ.10 లక్షల జరిమానా విధిస్తామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల సిమ్ డీలర్లు ఉన్నారని.. వారు వెరిఫికేషన్ పూర్తి చేయాలని అందుకోసం తగిన సమయం ఇస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.

Ghulam Nabi Azad: హిందూ-ముస్లింలపై గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇకపై.. బల్క్ కనెక్షన్ల నిబంధనను తొలగించి, కొత్త విధానం(బిజినెస్ కనెక్షన్లు) పేరుతో అందుబాటులోకి తెస్తున్నట్లు అశ్విన్ వైష్ణవ్ చెప్పారు. ఆ విధానంలో వ్యక్తిగత కేవైసీ తప్పనిసరి అన్నారు. బిజినెస్‌లకు కేవైసీ సహా, సిమ్ కార్డులు విక్రయించే వారి కేవైసీ కూడా తప్పనిసరిగా ఉంటుందని వివరించారు. ఇటీవలే.. 52 లక్షల మొబైల్ కనెక్షన్లను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. అంతేకాకుండా 67వేల మంది డీలర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టామని.. 2023 మే నుండి సిమ్ కార్డ్ డీలర్లపై 300 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. 66వేలకు పైగా మోసపూరిత వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు తెలిపారు. ఇందుకు కారణం మోసపూరిత లావాదేవీలేనని అన్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టే కేంద్రం కొత్త రూల్స్ తో మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు.