ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో కి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది.జగన్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాలేదు..దీంతో రావలసిన నిధుల విషయం లో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం లభించింది.. విభజన హామీలు అమలు చేయకపోయినా కానీ ఎప్పటికప్పుడు నిధులిస్తూ వస్తుంది కేంద్రం.. ఇప్పుడు మరో విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం వినతిని అంగీకరించింది.ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ను సరఫరా చేసేందుకు వీలుగా వేసిన విద్యుత్ లైన్లకు ఆయా రాష్ట్రాలు ట్రాన్స్ కోకు ఛార్జీలు చెల్లించాల్సి అయితే ఉంది.
విద్యుత్ సరఫరా లైన్ల ఛార్జీలను చెల్లించాల్సిన ఆయా రాష్ట్రాలు మాత్రం సైలెంట్ గా ఉండిపోవడం తో ఈ బకాయిలు రూ.114 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తుంది.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం లో మొదలైన ఈ బకాయిలు జగన్ అధికారంలోకి వచ్చాక కూడా ఇంకా కొనసాగుతోంది. దీంతో వీటిని ఆ రాష్ట్రాల నుండి ఇప్పించాలని జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.2014-15 నుంచి 2018-19 వరకూ వసూలు కావాల్సిన ఈ ఛార్జీలను ఇతర రాష్ట్రాలు చెల్లించడం లేదు. కేంద్రం కూడా దీనిపై అంతగా స్పందించలేదు. దీంతో ఇప్పటివరకు ఏర్పడిన నష్టాల్ని కూడా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ట్రాన్స్ కో తరఫున ప్రభుత్పం చేసిన వినతి కేంద్రం స్పందించింది. దీంతో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీ పిటిషన్ పై విచారణ జరిపి ఈ రూ.114 కోట్ల ఛార్జీల బకాయిల వసూలుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం..అయితే 2014-15 నుంచి కాకుండా కేవలం 2016-17 నుంచి 2018-19 వరకూ మాత్రమే ఈ ఛార్జీల వసూలుకు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది.ఈ ఛార్జిల మొత్తం కొంతే అయినా విద్యుత్ సంస్ధల ఆర్ధిక పరిస్ధితి దృష్ట్యా చూస్తే కనుక మాత్రం పెద్ద మొత్తమే అని చెప్పాలి.దీంతో ప్రభుత్వం దీనిపై ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు ఆ బకాయిలు రాబట్టేందుకు అనుమతిని పొందింది.