NTV Telugu Site icon

Central Cabinet: కొబ్బరి రైతులకు కేంద్రం శుభవార్త..

Coconut

Coconut

Central Cabinet: కొబ్బరి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొప్రా ఎంఎస్‌పిని క్వింటాల్‌కు రూ. 300 పెంచుతూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మిల్లింగ్ కొప్రా ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.10860 నుంచి రూ.11160కి పెరిగింది. మరోవైపు.. బాల్ కొప్రా ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.11750 నుంచి రూ.12000కి పెంచారు. పెంచిన ధరల ద్వారా కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉంటే, ఈరోజు జరిగిన సమావేశంలో.. బీహార్‌లోని దిఘా నుండి సోన్‌పూర్ మధ్య గంగా నదిపై 6 లేన్ల కేబుల్ వంతెనను నిర్మించే ప్రతిపాదన కూడా ఆమోదించింది.

Minister Seethakka : డిసెంబ‌ర్ 28కు ఎంతో చారిత్రక నేప‌థ్యముంది

కొప్రా అంటే ఏమిటి..?
వాస్తవానికి.. కొబ్బరి పొడి భాగాన్ని కొప్రా అంటారు. దీనిని భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో గారి అని, మరికొన్ని ప్రాంతాలలో గోల అని పిలుస్తారు. ప్రత్యేక ప్రక్రియ ద్వారా కొబ్బరి నుండి పెంకులు తీస్తారు. మిల్లింగ్ కొప్రాలో ఎండిన కొబ్బరి ముక్కలు ఉంటాయి. వీటిని ప్రధానంగా కొబ్బరి నూనె తయారీలో ఉపయోగిస్తారు. బాల్ కొప్రా అనేది సాధారణంగా కొబ్బరి నుంచి బాగా ఎండబెట్టిన భాగం. దీనిని అనేక ఆహార తయారీలలో ఉపయోగిస్తారు.