NTV Telugu Site icon

Centrol Govt: భారత్ లో ట్విట్టర్ మూసివేతపై కేంద్రం క్లారిటీ..

Tweeter

Tweeter

రైతు ఉద్యమాన్ని కవర్ చేసే ఖాతాలను బ్లాక్ చేయమని భారత ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తోందని ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డార్సీ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఇలాంటి ఖాతాలను మూసివేయాలని కోరారు. అంతేకాదు భారత్‌లో ట్విటర్‌ను మూసేస్తామనే బెదిరింపు కూడా వచ్చింది అని ఆయన పేర్కొన్నారు.

Also Read : Migration to BJP: బీజేపీలోకి మళ్లీ మొదలైన వలసలు.. కాషాయ గూటికి మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి..?

రైతు ఉద్యమానికి సంబంధించి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న అటువంటి జర్నలిస్టుల ఖాతాలను మూసివేయాలని భారత ప్రభుత్వం అభ్యర్థించిందని ట్విట్టర్ మాజీ సీఈఓ తెలిపారు. ట్విట్టర్ ఇలా చేయకుంటే ఇండియాలో షట్ డౌన్ చేసి ఇండియాలోని ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేస్తారని అనిపించింది. అయితే భారత్ ప్రజాస్వామ్య దేశమని డార్సీ అన్నారు. భారత్‌తో పాటు టర్కీలో కూడా అదే సమస్యను ఎదుర్కొంటోందని డార్సీ అన్నారు. అక్కడి ప్రభుత్వం కూడా ట్విట్టర్‌ను మూసేస్తానని బెదిరించింది అని పేర్కొన్నాడు.

Also Read : Syria Chopper Crash: సిరియా హెలికాప్టర్ ప్రమాదం.. 22 మంది అమెరికా సైనికులకు గాయాలు

జాక్ డార్సీ వాదనపై ఇప్పుడు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బదులిచ్చారు. డార్సీ నిక్కచ్చిగా అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ట్విట్టర్ పలుమార్లు భారత చట్టాలను ఉల్లంఘించిందని ఆయన వెల్లడించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఇది జాక్ డార్సీ చెప్పింది పచ్చి అబద్ధం-బహుశా ట్విటర్ చరిత్రలో చాలా సందేహాస్పదమైన కాలాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేసింది అని పేర్కొన్నాడు. డార్సీ అతని బృందం ఆధ్వర్యంలో, ట్విట్టర్ భారత చట్టాన్ని స్థిరంగా ఉల్లంఘిస్తోందని అన్నాడు. తామ ప్రభుత్వం ఎవరిని జైలుకు పంపించ లేదు.. ట్విట్టర్ ఆఫీస్ ను షట్‌డౌన్ చేయలేదు అని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. భారత్ పై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

Show comments