మెగాస్టార్ చిరు : చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ!
విక్టరీ వెంకటేష్ : నా ప్రియమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు!! మీరు చేసే ప్రతి పనిలో మీకు ఆనందం, బలం మరియు విజయం కలగాలని కోరుకుంటున్నాను.
అల్లు అర్జున్ : మా పవర్ స్టార్ & డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
సాయి దుర్గ తేజ్ : నాకు పట్టుదల నేర్పించి.. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన నా గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు. పుట్టున రోజు శుభకాంక్షలు మామ!
డైరెక్టర్ సుజీత్ : ఎంతో మందికి ఇన్స్పిరేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య కి హ్యాపీ బర్త్డే – మీ కోట్ల అభిమానుల్లో ఒకడ్ని…
డైరెక్టర్ జ్యోతి కృష్ణ : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మీ వారసత్వం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూ, ప్రేరణనిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. నాయకుడు అంటే మార్గం తెలిసినవాడు, దారిలో నడిచేవాడు మరియు మార్గం చూపించేవాడు, మన నిజమైన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు.
గోపీచంద్ మలినేని : మన ప్రియమైన పవర్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆసక్తి, దృఢ సంకల్పం కలిస్తే ఏదీ అసాధ్యం కాదని నిరూపించిన నిజమైన ఐకాన్.మీకు ఎల్లప్పుడూ ఆనందం, విజయం & మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాను.
బాబీ : మన కోసం కన్న కలలు నిజం చెయ్యడానికి తన కోసం ఉన్న సుఖాలను వదులుకొని జన సైనికుడిగా నిరంతరం శ్రమిస్తున్న అలుపెరుగని సేనాని పవన్ కళ్యాణ్ గారికి … పుట్టిన రోజు శుభాకాంక్షలు.
తమన్ : మా L-E-A-D-E-R, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కు హ్యాపీస్ట్ బర్త్‌డే శుభాకాంక్షలు.