Site icon NTV Telugu

Chandrababu: చంద్రబాబు నివాసం వద్ద కార్యకర్తల కోలాహలం

Chandrababu Residence

Chandrababu Residence

Chandrababu: ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం నెలకొంది. చంద్రబాబు, లోకేష్, ఎన్టీఆర్ బ్యానరుకు 164 బిందెలతో పాలాభిషేకం చేశారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు. ఇది తన విజయం కాదని తెలుగు దేశం కార్యకర్తల విజయమని ఆయన అన్నారు. 164 సీట్లు గెలిచి సరికొత్త రికార్డు సృష్టించిందని ఎంపీ పేర్కొన్నారు. తెలుగుదేశంలో ఒక సామాన్య కార్యకర్తను ఎంపీని చేసిన ఘనత లోకేష్‌కే దక్కుతుందన్నారు. చంద్రబాబు, లోకేష్‌లను మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

Read Also: AP CEO Meet Governor: గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందజేసిన ఏపీ సీఈవో

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 135, జ‌న‌సేన 21, వైఎస్సార్‌సీపీ 11, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిస్థాయి మెజార్టీ సాధించింది టీడీపీ. ఈ నేప‌థ్యంలో 12వ తేదీన చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ‌స్వీకారం చేయ‌నున్నారు. కాంగ్రెస్ అధిష్టానం అనుమ‌తిస్తే చంద్రబాబు ప్రమాణ‌స్వీకారానికి వెళ్తాన‌ని రేవంత్ నిన్న ప్రెస్‌మీట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.

 

Exit mobile version