Sai Krishna Death Case: విజయవాడ సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన 25 ఏళ్ల యువకుడు గడే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ (లాకప్ డెత్) వ్యవహారంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారికంగా రంగంలోకి దిగింది. పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నిండు ప్రాణాన్ని బలిగొని, ఆధారాలు లేకుండా దహనం చేసిన ఈ దారుణ ఘటనపై రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరిపోదని స్పష్టం చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. హత్య, అక్రమ నిర్బంధం, శవాన్ని మాయం చేయడం మరియు సాక్ష్యాధారాల తారుమారు వంటి తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేంద్ర దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కృష్ణా లంక పోలీస్ స్టేషన్ సిబ్బంది ఓ కేసు విచారణ పేరుతో గడే సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అధికారిక రికార్డులు లేకుండా స్టేషన్లో అక్రమంగా నిర్బంధించిన పోలీసులు, విచారణ పేరిట విచక్షణారహితంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు . సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) నాగరాజు మరియు ఇతర సిబ్బంది లాఠీలతో తీవ్రంగా కొట్టడం, చిత్రహింసలకు గురిచేయడంతో దెబ్బలకు తాళలేక సాయి కృష్ణ పోలీస్ కస్టడీలోనే ప్రాణాలు విడిచాడు.
Also Read
- Meerut Blue Drum Case: హైకోర్టుకు ముస్కాన్, సాహిల్.. ఉరిశిక్షపై అప్పీల్.!
- Kolhapur Gold Theft: మామ ఇంట్లో బంగారం చోరీ చేసి థార్ కొనుగోలు.. కారు పూజకు మామే చీఫ్ గెస్ట్!
- Pashamylaram Drug Raid: తెలంగాణలో భారీగా డ్రగ్స్ ముడిసరుకు ఫ్యాక్టరీ గుట్టురట్టు..
- Alluri District Blast: మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
సాయి కృష్ణ లాకప్‌లోనే చనిపోయాడని గుర్తించిన పోలీసులు, ఆ నిజాన్ని కప్పిపుచ్చేందుకు అత్యంత దారుణమైన కుట్రకు తెరలేపారు. సీఐ నాగరాజు తన సహచర హెడ్ కానిస్టేబుల్ అశోక్, ప్రైవేట్ వ్యక్తి సురేష్‌లతో కలిసి మృతదేహాన్ని ఒక దుప్పట్లో చుట్టి అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా కారులో విజయవాడలోని ‘స్వర్గపురి’ శ్మశానవాటికకు తరలించారు. బంధువులకు గానీ, మేజిస్ట్రేట్‌కు గానీ సమాచారం ఇవ్వకుండా, పంచనామా మరియు పోస్టుమార్టం నిర్వహించకుండానే శవాన్ని రహస్యంగా దహనం చేశారు. అంతేకాకుండా, స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పూర్తిగా తొలగించి, సుమారు 41 రోజుల పాటు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా సాయి కృష్ణ ఎటో వెళ్లిపోయాడంటూ బుకాయించారు.
తన కుమారుడి ఆచూకీ కోసం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో బాధితుడి తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. సిట్ జరిపిన సమగ్ర విచారణలో పోలీసుల దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. పోలీసుల విచక్షణారహిత కొట్టడం వల్లే సాయి కృష్ణ మృతి చెందాడని, మృతదేహాన్ని దహనం చేసి ఆధారాలు నాశనం చేశారని సిట్ నిర్ధారించి సీఐ నాగరాజును అరెస్ట్ చేసింది.
ఈ కేసు తీవ్రతను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసు వ్యవస్థ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “కస్టోడియల్ చిత్రహింసలు అనేవి ప్రాథమిక మానవ హక్కులు మరియు వ్యక్తిగత గౌరవంపై జరిగే తీవ్రమైన దాడి” అని న్యాయస్థానం స్పష్టం చేసింది . నిందితులు స్వయంగా పోలీసు విభాగంలో ఉన్నతాధికారులుగా ఉన్న నేపథ్యంలో స్థానిక పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా సాగడం అసాధ్యమని పేర్కొంటూ కేసును తక్షణమే సీబీఐకి బదిలీ చేసింది. అదే సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ, సాయి కృష్ణ తల్లికి ₹25 లక్షల మధ్యంతర పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల ప్రతి మరియు సిట్ సేకరించిన కేస్ డైరీలను స్వాధీనం చేసుకున్న సీబీఐ ప్రత్యేక బృందం, ఎఫ్ఐఆర్ నమోదు చేసి అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది. అక్రమ నిర్బంధంలో ఎవరెవరి పాత్ర ఉంది? చిత్రహింసల్లో పాల్గొన్న ఇతర సిబ్బంది ఎవరు? శ్మశానవాటికలో రికార్డులను తారుమారు చేయడంలో ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి? సీసీటీవీ దృశ్యాలను తొలగించాల్సిందిగా పైస్థాయి అధికారులు ఎవరైనా ఆదేశించారా? అనే కోణాల్లో సీబీఐ లోతైన విచారణ జరుపుతోంది. సీబీఐ రంగప్రవేశంతో విజయవాడ కమిషనరేట్ పరిధిలోని పలువురు పోలీసు అధికారుల్లో గుబులు మొదలైంది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!