NTV Telugu Site icon

MP Avinash Reddy : ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

Avinash

Avinash

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరుకావాంటూ సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ కోటిలోని సీబీఐ కార్యాలయంలో విచారణ రావాలంటూ ఆ నోటీసుల్లో తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించింది.

Also Read : Health Tips : నిద్ర లేకుండా మనిషి ఎంతకాలం జీవించగలడు?

కాగా.. వైఎస్‌ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టుకెళ్లిన ప్రతిసారీ సీబీఐ అనేక విషయాలను వెల్లడిస్తోంది. అంతకుముందు విచారించిన సీబీఐ.. ఎంపీ అవినాష్‌పై రెండు నేరాలను మోపిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఆధారాలను మాయం చేశాడంటూ సీబీఐ తెలిపింది. ఈ క్రమంలోనే ఇవాళ మళ్లీ నోటీసులను జారీ చేయడం సంచలనంగా మారింది. ఇవాళ ఉదయం వరకు హైదరాబాద్ లో ఉన్న అవినాష్.. కడపకు వెళ్లారు.. తాజాగా నోటీసులు ఇవ్వడంతో మళ్లీ హైదరాబాద్ కు ఆయన తిరిగి వస్తున్నారు.

Also Read : Vande Bharat Express : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరో 16 కోచ్‌లు

ఇప్పటికే ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసి పలుసార్లు విచారణ చేసింది. ఈ క్రమంలో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ కోసం పిటీషన్ వేయగా సీబీఐ కోర్టు దానిని కొట్టివేసింది. ఈ కేసులో సీబీఐ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కేసును తొందరగా పూర్తి చేసేందుకు విచారణ ముమ్మరం చేశారు.