NTV Telugu Site icon

Delhi Liquor case: కవితకు మరో చుక్కెదురు..! విచారణ కోసం సీబీఐ పిటిషన్

Cuien

Cuien

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో చుక్కెదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా సీన్‌లోకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఎంట్రీ ఇచ్చింది. కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో కవితను విచారించాల్సిన అవసరముందని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను మార్చి 15న అదుపులోకి తీసుకుని కొన్ని రోజుల పాటు విచారించింది. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు. తాజాగా తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరుతోంది. మరీ న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Mamata Banerjee: విషపూరిత పామును పెంచుకోవచ్చు.. కానీ బీజేపీని నమ్మలేం..

ఇదే కేసులో కవితకు గతంలో కూడా సీబీఐ నోటీసులు ఇచ్చింది. తమ ఎదుట హాజరుకావాలని కోరింది. కానీ హాజరుకాలేదు. తాజాగా సీబీఐ కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ఇదిలా ఉంటే తమ కుమారులకు పరీక్షలు జరుగుతున్నందున తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో కవిత పిటిషన్ వేశారు. గురువారం విచారించిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది.

ఇది కూడా చదవండి: Rashmika Mandanna : రష్మిక మందన్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న కవితను, మార్చి 21న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఇద్దరికీ జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఇద్దరూ తీహార్ జైల్లో ఉంటున్నారు. ఇద్దరి బెయిల్ పిటిషన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గతేడాది నుంచి తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆయనకు ఇంకా బెయిల్ లభించలేదు.

ఇది కూడా చదవండి: Collector Dilli Rao : నాటుసారా తయారు చేసే గ్రామాల పై ఫోకస్ పెట్టాం