Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలువురిని సీబీఐ అరెస్ట్ చేసింది. తాజాగా దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు CBI సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఈ సమన్లలో సీబీఐ పేర్కొంది. ఈ విషయంలో గతంలోనే మనీష్ సిసోడియా స్వయంగా చెప్పారు. గతంలో ఆయన నివాసంలో అధికారులు రైడ్స్ చేశారు. మరి రేపటి విచారణలో మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు సిసోడియా ఎలాంటి సమాధానం చెబుతారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేపటి విచారణ అనంతరం సీబీఐ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో ప్రస్తుతానికి సస్పెన్సే.
కాగా గతేడాది అక్టోబర్ లో కూడా మనీష్ సిసోడియాను 9 గంటల పాటు సీబీఐ విచారించింది. అంతేకాదు ఆయన నివాసంలో, కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు. అప్పుడు మనీష్ సిసోడియా సీబీఐ విచారణ, లిక్కర్ స్కాంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ పాలసీ కేసును పూర్తిగా నకిలీ, కల్పితంగా ఆయన అభివర్ణించారు. ఇది ఎక్సైజ్ పాలసీ లేదా అవినీతికి సంబంధించిన కేసు కాదని ప్రశ్నించినప్పుడు తనకు అసలు విషయం అర్థమైందని అన్నారు. ఈ కేసు కేవలం ఢిల్లీలో ఆపరేషన్ లోటస్‌ని విజయవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఏజెన్సీ ప్రధాన కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరాలని తనపై ఒత్తిడి తెచ్చారని కూడా సిసోడియా ఆరోపించారు.
Read Also: KFC Chicken: KFC సేఫ్ కాదా..? KFC చికెన్ తింటే క్యాన్సర్ వస్తుందా..?
కాగా ఫిబ్రవరి 18న ఆయనకు మొదటిసారి సీబీఐ సమన్లు ఇచ్చింది. 19న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే బడ్జెట్ రూపకల్పనలో ఉన్నందున తాను సీబీఐ విచారణకు రాలేనని మనీష్ సిసోడియా సీబీఐకి లేఖ రాశారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సీబీఐ 26న విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చారు.
Read Also: Bio Asia : ఇకపై ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేస్తారు
సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయనుంది.. సీఎం కేజ్రీవాల్
సిసోడియా ఢిల్లీ విద్యార్థులకు మెరుగయిన విద్య అందించేందుకు కృషి చేసున్నారు. ఇప్పటికే మనీష్ సిసోడియా నివాసం, బ్యాంకు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించి సిబిఐ ఏం పట్టుకోలేదన్నారు. ఆయనకు పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక సిసోడియా అరెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.