Site icon NTV Telugu

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఊరట.. మధ్యంతర బెయిల్‌ మంజూరు

Ys Bhaskar Reddy

Ys Bhaskar Reddy

YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్‌ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఈ నెల 30వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.. అయితే, వచ్చే నెల 1వ తేదీ ఉదయం 10.30 గంటలకు చంచల్ గూడ జైలుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.. అంతే కాదు.. పాస్‌పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని.. తాను ఉంటున్న చిరునామా కోర్టుతో పాటు సీబీఐ అధికారులకు ఇవ్వాలని ఆదేశించింది.. ఆస్పత్రికి చికిత్సకు వెళ్లాల్సి వస్తే దానికి సంబంధించిన వివరాలను సీబీఐకు తెలపాలనే షరతు కూడా విధించింది..

Read Also: Manchu Vishnu: రష్మిక డీప్ ఫేక్ వీడియో.. ‘మా’ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే.. ?

ఇక, మధ్యంతర బెయిల్‌పై ఉన్న సమయంలో.. కుటుంబ సభ్యులను తప్ప మిగతా ఎవరినీ కలవొద్దని వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని ఆదేశించింది సీబీఐ కోర్టు.. అయితే, సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఎస్కార్ట్ బెయిల్ పై ఉన్నారు వైఎస్ భాస్కర్ రెడ్డి.. ఎస్కార్ట్ బెయిల్ ను మధ్యంతర బెయిల్ గా మార్చింది సీబీఐ కోర్టు.. వైఎస్‌ వివేకా హత్య కేసులో ఏప్రిల్ 16వ తేదీన భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు.. కాగా, వైఎస్‌ వివేకా హత్య కేసులో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం విదితమే.. విచారణలో జాప్యంపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.. ఇక, ఏపీ నుంచి తెలంగాణకు కేసు మార్చిన విషయం తెలిసిందే.

Exit mobile version