NTV Telugu Site icon

Sandeshkhali Case: తొలి ఛార్జిషీటు దాఖలు.. నిందితులపై హత్యాయత్నం కేసు

Ee

Ee

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందేశ్‌ఖాలీ కేసులో తొలి ఛార్జ్‌షీటును సీబీఐ దాఖలు చేసింది. ఇక ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ సహా నిందితులందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది. బసిర్‌హత్ ప్రత్యేక కోర్టుకు సీబీఐ ఛార్జ్ షీట్ సమర్పించింది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన కోట్లాది రూపాయల రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించిన సంబంధాలు, రాష్ట్ర మాజీ ఆహార మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్‌తో సంబంధాలతో సహా షాజహాన్, అతని సహచరులపై వచ్చిన ఆరోపణలపై ఛార్జ్‌షీటులో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Tirumala Special Days In June: జూన్ 2024 తిరుమలలో ప్రత్యేక రోజుల వివరాలు ఇలా..

జనవరి 5న సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందంపై షాజహాన్ సహచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. అనంతరం టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్, అతని సోదరుడు, మరో ఐదుగురిపై సీబీఐ నేరపూరిత కుట్ర, హత్యాయత్నం కింద అభియోగాలు మోపినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఈ కేసులో తొలి ఛార్జిషీటును బసిర్‌హత్ ప్రత్యేక కోర్టులో సోమవారం దాఖలు చేసినట్లు వారు తెలిపారు. హాజహాన్ షేక్‌, అతని సోదరుడు అలోమ్‌గిర్‌, సహచరులు జియావుద్దీన్‌ మొల్లా, మఫుజర్‌ మొల్లా, దిదర్‌బక్ష్‌ మొల్లా సహా ఏడుగురిపై చార్జ్‌షీట్‌ ఉందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: WhatsAppUpdate: వాట్సప్ లో కొత్త అప్‌డేట్‌..ఇకపై ఒక నిమిషం వరకు అవకాశం

నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120-బీ (నేరపూరిత కుట్ర), 307 (హత్యాయత్నం) అల్లర్లు, చట్టవిరుద్ధమైన అనేక ఇతర అభియోగాలు నమోదు చేసింది. కోల్‌కతాకు 80 కిలోమీటర్ల దూరంలో సందేశ్‌ఖాలీ ప్రాంతం ఉంది. హాజహాన్, అతని అనుచరులు లైంగిక వేధింపులు, భూకబ్జాలకు పాల్పడినట్లు మహిళలు ఆరోపించారు. జనవరి 5న జరిగిన ఘటనలకు సంబంధించి మూడు కేసుల్లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఫిబ్రవరి 29న షాజహాన్‌ను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయగా.. మార్చి 6న సీబీఐ కస్టడీలోకి తీసుకుంది.

ఇక సందేశ్‌ఖాలీ బాధితులను ప్రధాని మోడీ పరామర్శించి ఓదార్చారు. అంతేకాకుండా బాధితురాలికి లోక్‌సభ సీటు కూడా బీజేపీ ఇచ్చింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Man Stomach: అది కడుపా లేక.. గ్యారేజా.. వ్యక్తి కడుపులో గోళ్లు, సూదులు, బోల్ట్‌లు..