CBI: అక్రమాస్తుల కేసులో వాప్కోస్ మాజీ సీఎండీ రాజిందర్ గుప్తా, అతని కొడుకు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBI arrests WAPCOS former CMD Rajinder Gupta, son in disproportionate asset case: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) బుధవారం వాప్కోస్(WAPCOS) మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజిందర్ కుమార్ గుప్తా, అతని కుమారుడు గౌరవ్‌ను అరెస్టు చేసింది. ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్, సోనిపట్, ఘజియాబాద్‌తో పాటు దేశంలోని 19 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించి నిందితుల వద్ద రూ.38 కోట్ల నగదును గుర్తించింది. ఈ సోదాల్లో మంగళవారం రూ.20 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా.. బుధవారం మరో రూ.18 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేసినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు.
Read Also: Jharkhand Wedding: పూరీలు వేడిగా లేవని రచ్చరచ్చ చేశారు.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
Also Read
- Meta: మెటాకు భారీ షాక్.. ఫేస్బుక్, ఇన్‌స్టా వ్యసనంపై రూ.133 లక్షల కోట్ల కేసు!
- No Number Plate, No Fuel: నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్.. సంచలన నిర్ణయం.. వెంటనే అమల్లోకి..!
- West Bengal: బెంగాల్లో ‘కాక్రోచెస్’ వర్సెస్ బీజేపీ.. కార్యకర్త తండ్రి మృతితో సీజేపీ ఆగ్రహం
- Tamil Nadu: చంటి బిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే.. విమర్శలపై కౌంటర్
కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నియంత్రణలో పనిచేసే ప్రభుత్వం రంగ సంస్థ వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్(WAPCOS) ఇండియా లిమిటెడ్ మాజీ సీఎండీ తన పదవీకాలంలో ఉన్న సమయంలో భారీగా అక్రమార్జనకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజిందర్ కుమార్ గుప్తాతోపాటు ఆయన భార్య రీమా సింఘాల్, తనయుడు గౌరవ్ సింఘాల్, కోడలు కోమల్ సింఘాల్‌లపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సోదాలు నిర్వహించగా.. భారీగా నగదుతో పాటు నగలు, విలువైన ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన పలు దస్త్రాలను సైతం స్వాధీనం చేసుకునట్టు అధికారులు తెలిపారు. రాజిందర్ గుప్తాతో పాటు ఆయన తనయుడు గౌరవ్ సింఘాల్‌ను సీబీఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. 2011 ఏప్రిల్ నుంచి 2019 మార్చి 31వరకు వాప్కాస్ సంస్థలో గుప్తా పదవీకాలంలో ఉన్న సమయంలో భారీగా అక్రమార్జనకు పాల్పడినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Party Movie: అస్తిత్వాల అంతర్మథనం “పార్టీ”
-
CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
-
Meta: మెటాకు భారీ షాక్.. ఫేస్బుక్, ఇన్‌స్టా వ్యసనంపై రూ.133 లక్షల కోట్ల కేసు!
-
No Number Plate, No Fuel: నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్.. సంచలన నిర్ణయం.. వెంటనే అమల్లోకి..!
-
West Bengal: బెంగాల్లో ‘కాక్రోచెస్’ వర్సెస్ బీజేపీ.. కార్యకర్త తండ్రి మృతితో సీజేపీ ఆగ్రహం
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!