Site icon NTV Telugu

Mouth Ulcers: నోటి పుండ్లు ఎందుకు వస్తాయి? వస్తే ఎలా తగ్గించుకోవాలంటే!

Mouth Ulcers

Mouth Ulcers

Mouth Ulcers: నోటి లోపల చిన్న చిన్న గాయం లేదా పుండ్ల రూపంలో కనిపించే మౌత్ అల్సర్లు చాలా మందిలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్య. ఇవి తినే సమయంలో, మాట్లాడే సమయంలో చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన బాధను కలిగించవచ్చు. ఈ అల్సర్లకు కారణాలు ఎన్నో ఉంటాయి. అలాగే నివారణ, చికిత్స మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఏంటో ఒకసారి చూద్దామా..

Read Also: UP: ‘‘డ్రమ్‌లో ముక్కలవ్వడం ఇష్టం లేదు’’.. భార్య అక్రమ సంబంధంపై భర్త.. వీడియో వైరల్..

మొదటగా మౌత్ అల్సర్లకు ముఖ్య కారణాలను చూసినట్లయితే.. మానసిక ఒత్తిడి నోటి పుండ్లకు ప్రధాన కారణాల్లో ఒకటి. ఒత్తిడిలో ఉండే వ్యక్తులకు తరచుగా మౌత్ అల్సర్లు వస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా విటమిన్ B12, విటమిన్ C, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల నోటిలో పుండ్లు రావచ్చు. అంతేకాకుండా మసాలా పదార్థాలు, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం వంటి వాటి వల్ల అల్సర్లు రావచ్చు. అలాగే కొంతమంది మహిళల్లో నెలసరి సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా మౌత్ అల్సర్లు వస్తుంటాయి. ఇంకా కొన్ని మందులు మౌత్ అల్సర్లకు కారణం కావచ్చు.

ఇక వీటి చికిత్స లేదా నివారణ విషయానికి వస్తే.. ధ్యానం, యోగా వంటి పద్ధతుల ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. అలాగే విటమిన్‌లు, మినరల్స్ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది. అలాగే ఎక్కువ మసాలా ఆహారాలు తీసుకోక పోవడం మంచిది. ఇక వీటి నుండి ఉపశమనం పొందాలంటే ఫార్మసీలో దొరికే నోటి జెల్లు, మౌత్ వాష్‌లు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు బెంజామిన్ పెరాక్సైడ్, ఓరల్ అనిసెప్టిక్ జెల్లును వాడుకోవచ్చు. అలాగే కొద్దిగా సోడియం బైకార్బోనేట్ (బేకింగ్ సోడా) నీటిలో కలిపి గార్గిల్ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇంకా వీలైతే, సహజంగా తీయదగిన అల్వెరా జెల్‌ను నోటిలో అల్సర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల శాంతి కలుగుతుంది. ఒకవేళ మౌత్ అల్సర్లు 10 రోజులకంటే ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి.

Exit mobile version