ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని ఓ గ్రామంలో ప్రేమ జంట పొలంలో రహస్యంగా కలుసుకున్నారు. వాళ్లను గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సమీపంలోని ఆలయంలో ఇద్దరికీ వివాహం చేశారు. ఆ తర్వాత నవ వరుడి వెంట.. వధువును పంపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయం ఇద్దరి కుటుంబ సభ్యులకు కూడా తెలుసు.
READ MORE: Manchu Vishnu : అమితాబ్ బచ్చన్ ను డైరెక్ట్ చేస్తా.. విష్ణు కామెంట్స్..
ఫతేహాబాద్‌లోని పాల్తువా పురా గ్రామానికి చెందిన లక్ష్మణ్ సింగ్ (22), షాబెద్ గ్రామానికి చెందిన ప్రీతి (20) ప్రేమించుకున్నారు. లక్ష్మణ్ ఓ మొబైల్ దుకాణంలో పనిచేస్తుండగా, ప్రీతి బిఎస్సీ పూర్తి చేసింది. దాదాపు ఏడాది కిందట.. ప్రీతి తన మొబైల్ డిస్ప్లేను రిపేర్ చేయించడానికి లక్ష్మణ్ దుకాణానికి వెళ్ళింది. ఇక్కడే ఇద్దరి మధ్య సంభాషణ ప్రారంభమైంది. వారి స్నేహం క్రమ క్రమంగా ప్రేమగా మారింది. ఇంతలో మంగళవారం ప్రతీ ప్రియుడిని తన గ్రామానికి ఆహ్వానించింది.
READ MORE: AP Crime: ప్రాణం తీసిన స్వలింగ సంపర్కం..! బయట పడుతుందనే భయంతో వ్యక్తి దారుణ హత్య
ప్రీతి ఫోన్ చేయగానే లక్ష్మణ్ ఆమెను కలవడానికి సిద్ధమయ్యాడు. వారిద్దరూ గ్రామం వెలుపల పొలంలో కలవాలని అనుకున్నారు. వీరిద్దరూ కలుసుకోవడం గ్రామంలోని కొంత మంది చూశారు. ఇద్దరినీ పట్టుకున్నారు. ఇరు కుటుంబాలకు ఫోన్ చేశారు. అయితే.. లక్ష్మణ్ కుటుంబం అక్కడికి రావడానికి నిరాకరించింది. 4 నెలల క్రితం వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయినట్లు యువకుడు తెలిపాడు. అందుకే తన కుటుంబ సభ్యులు రావడం లేదని చెప్పాడు. దీంతో వీరికి పెళ్లి చేయాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. గ్రామానికి సమీపంలోని ఓ దేవత ఆలయంలో లక్ష్మణ్, ప్రీతిలకు పెళ్లి చేశారు. ఆలయంలో దేవుడి సాక్షిగా పూలమాలలు మార్చుకున్నారు. అనంతరం అమ్మాయిని వరుడి ఇంటికి సాగనంపారు.