Caste Census: నేటితో ముగియనున్న కులగణన సర్వే.. వివరాలు ఇవ్వని వారు సర్వేలో పాల్గొనాలి: మంత్రి పొన్నం
- నేటితో ముగియనున్న కులగణన సర్వే
- వివరాలు ఇవ్వని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలి
- 16 నుండి 28 వరకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుల గణన సర్వే నేటితో ముగియనుందని.. ఇంకా సర్వేలో పాల్గొనని వారు, ఎన్యుమారెటర్లకు వివరాలు ఇవ్వని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కుల గణన సర్వేలో పాల్గొనాలని కోరారు. ఎక్కడెక్కడ ఇంకా కుల సర్వేలో పాల్గొనలేదో.. అక్కడ కుల సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు, మేధావులు, ఫ్రొఫెసర్లు వారికి అవగాహన కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. కుల గణనలో పాల్గొనని వారికి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16 నుండి 28 వరకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.
‘కుల గణనలో పాల్గొనని వారికి ప్రభుత్వం ఈ నెల 16 నుండి 28 వరకు అవకాశం ఇచ్చింది. సర్వే గడువు నేటితో గడువు ముగుస్తుంది. సర్వేలో పాల్గొనని వారికి నేడు చివరి రోజు. పాల్గొనని వారికి కుల గణన సర్వేలో పాల్గొని సమాచారం ఇవ్వండి. తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే.. కుల గణన సర్వేలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా. కుల గణన సర్వే కోసం టోల్ ఫ్రీ నం. 040-211 11111ను ఏర్పాటు చేయడం జరిగింది. తాము కుల సర్వేలో పాల్గొనలేదని ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి.. ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
‘ఆన్లైన్లో నమోదు చేసుకునే వారు https://seeepcsurvey.cgg.gov.in ద్వారా తమ సమాచారాన్ని ఇవ్వవచ్చు. అందుతున్న పథకాలు అర్హులుగా ఉండాలి. ఎక్కడెక్కడ ఇంకా కుల సర్వేలో పాల్గొనలేదో.. అక్కడ కుల సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు, మేధావులు, ఫ్రొఫెసర్లు వారికి అవగాహన కల్పించాలి. వారు ఈరోజు కుల సర్వేలో పాల్గొనేలా చేయాల్సిన బాధ్యత మీదే. సర్వేలో పాల్గొనని వారిని భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!