Site icon NTV Telugu

Eatala Rajendar: ముసలికన్నీరు కార్చే కాంగ్రెస్‌కి చెంపపెట్టులా దేశంలో కులగణన..!

Eatala Rajendar

Eatala Rajendar

Eatala Rajendar: కేంద్రం చేపట్టబోతున్న కులగణనపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఈ ప్రకటన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు గౌరవాన్ని కలిగించడమే కాకుండా.. చరిత్రాత్మక నిర్ణయంగా పేర్కొన్నారు. ఈటల మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలో 48 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ బీసీల జనగణన చేపట్టలేదని, అణగారిన వర్గాలకు ఛాంపియన్‌లా నటిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లను మాత్రమే కొల్లగొట్టారని కాంగ్రెస్ ను విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు తగిన చర్యలు తీసుకోకుండా, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కంటతడి పారిస్తుండటం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ 2014లో ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాని చేయడం ద్వారా చరిత్ర సృష్టించింది. అలాగే 2021లో ఆదివాసి వర్గానికి చెందిన బిడ్డను రాష్ట్రపతిగా నియమించింది. ఇది బీజేపీ అణగారిన వర్గాల పట్ల ఉన్న కట్టుబాటుకు నిదర్శనం అని అన్నారు.

Read Also: Revanth Reddy: కార్మిక లోకానికి ‘మే’ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం!

ఈ సందర్బంగా ఈటల రాజేందర్ కేంద్ర మంత్రివర్గంలో సామాజిక న్యాయం ఎలా ప్రతిబింబించిందో వివరించారు. 27 మంది ఓబీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు, 5 మంది మైనారిటీలు ఇలా మొత్తం 60 శాతం మంది అణగారిన వర్గాలకు చెందిన వారే మంత్రివర్గంలో ఉన్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కులగణన జరగడం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదే అని విమర్శించారు. ఇది ఓబీసీలకు గుర్తింపు కలిగించే చర్యగా అభివర్ణించారు. రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఈ వర్గాలకు మరింత ప్రాధాన్యం కలుగుతుందని తెలిపారు.

Read Also: Bandi Sanjay Kumar: జాతీయ కాంగ్రెస్ కులగణన వ్యతిరేకి.. కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!

కేంద్రం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులకి కృతజ్ఞతలు తెలుపుతూ, బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు నిజమైన అండగా నిలుస్తోందని ఈటల రాజేందర్ స్పష్టంగా తెలిపారు. ఇది ఒక దృఢమైన రాజకీయ ప్రకటనగా మాత్రమే కాకుండా, సామాజిక న్యాయానికి మార్గదర్శకంగా నిలిచే చర్యగా విపక్షాలపై విమర్శలు చేస్తూ ఈటల అభిప్రాయపడ్డారు.

Exit mobile version