Site icon NTV Telugu

Robbery: పట్టపగలే చోరీ.. క్షణాల్లో లక్షలు మాయం

Robbery

Robbery

Robbery: పట్టపగలే దొంగలు బరితెగించారు. క్షణాల్లో లక్షలు మాయం చేశారు. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లాలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని బౌద్ధ నగర్‌లో చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుజాత అనే మహిళ పిండి గిర్నికి వెళ్ళొచ్చేసరికి బీరువాలో ఉన్న 4.2 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. ఆమె ఇంటికొచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి దొంగతనం జరిగినట్లు ఆమెకు అర్థమైంది.

Drugs Mafia: డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎడ్విన్‌కు బెయిల్

సొంత ఇంటి కోసం కష్టపడి కూడబెట్టిన సొమ్మును దొంగలు ఎత్తుకెళ్లడంతో ఆ ఇంటి యజమాని కన్నీరుమున్నీరయ్యారు. చాలా కాలం కష్టపడి పోగేసిన డబ్బులను దొంగలు కాజేశారని ఇంటి యజమాని పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి యజమాని రామచంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version