NTV Telugu Site icon

Minister Nadendla Manohar: రైతులకు గుడ్‌న్యూస్.. ధాన్యం విక్రయించిన 24గంటల్లో నగదు జమ

Nadendla

Nadendla

Minister Nadendla Manohar: ఇప్పటి వరకూ రాష్ట్రంలో 418.75 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలులో ఇప్పటి వరకూ 391.50 కోట్లు రైతుల‌ ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇప్పటివరకు 24 గంటల్లోపు 281.30 కోట్లు రైతుల ఖాతాలో జమ అయినట్లు తెలిపారు. ధాన్యం విక్రయించిన 24గంటల్లో నగదు జమ అవుతోంది. ధాన్యం అమ్మిన రైతు ఖాతాల్లో 24 నుంచీ 48 గంటల్లో నగదు జమ చేసే విధానం కూటమి ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.

Read Also: Simhachalam: సింహాచలం ఆలయ భూముల అన్యాక్రాంతంపై విజిలెన్స్ విచారణ

తూర్పుగోదావరి, ప‌శ్చిమ‌గోదావరి, ఏలూరు, కాకినాడ‌, కోన‌సీమ‌, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 617 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. 24051 మంది రైతుల నుంచి 1,81,988 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.ధాన్యాన్ని ఎప్పుడు ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకునేలా వాట్సాప్ చాట్‌బోర్డ్‌ ఏర్పాటు చేశామన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారా ప్రత్యేక వాయిస్ సేవలు అందిస్తున్నామన్నారు. గోతాల సరఫరా నుంచి రవాణా వరకు అన్ని విధానాలు సులభతరం చేస్తామన్నారు.

Show comments