Site icon NTV Telugu

Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు

Raja Singh

Raja Singh

Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా హనుమాన్‌ వ్యాయామశాల వద్ద ఉపన్యసిస్తూ ఎన్నికల నియమావళి ఉల్లఘించారని కేసు నమోదు చేశారు. సుల్తాన్‌బజార్‌ పీఎస్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ ఫిర్యాదు మేరకు అదే పీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఐపీసీ 188, 290 రెడ్‌ విత్‌ 34, సిటీ పోలీస్‌ యాక్ట్‌ 21/76 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రాజాసింగ్‌ హనుమాన్ వ్యాయామశాల వద్ద మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన కేసు నమోదు చేయగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు రాజా సింగ్. గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాజాసింగ్ వివాదంతో ఏకంగా పార్టీ కొన్ని రోజులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.

Read Also: Studied Died: అమెరికాలో హుజూరాబాద్‌కు చెందిన విద్యార్థి మృతి

Exit mobile version