చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదు అయింది. మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై దుర్భాషలాడిన ఘటనలో ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టారని.. బెదిరింపులకు పాల్పడినట్లు మాజీ ఎంపీ ఆరోపించారు. ఈనెల 20న బంజారా హిల్స్ పోలీసులకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు కోర్టు అనుమతితో ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు ఫైల్ చేశారు.
Read Alo: Revolt RV400 BRZ : తక్కువ ధరతో రివోల్ట్ మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్స్, ధర ఎంతంటే?
ఇక, 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) తరపున చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటి చేసి విజయం సాధించారు. ఇక, 2018 టీఆర్ఎస్ పార్టీతో విభేదాల కారణంగా పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక, 2019లో ఎంపీ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి పోటీ చేయగా రంజిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక, మూడేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి .. 2021లో హస్తం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కమలం పార్టీలో కొనసాగుతున్నారు.