NTV Telugu Site icon

Sri Tej: యువతి ఫిర్యాదు.. సినీ హీరోపై కేసు నమోదు!

Sri Tej News

Sri Tej News

ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులపై వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. హీరో రాజ్ తరుణ్-లావణ్యల వ్యవహారం ఇండస్ట్రీని కుదిపేసింది. కొద్దిరోజులకే ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇటీవల యూట్యూబర్‌ హర్ష సాయిపై కూడా ఓ యువతి కేసు పెట్టింది. తాజాగా ప్రముఖ నటుడిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది.

ప్రముఖ నటుడు శ్రీ తేజ్‌పై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. శ్రీ తేజ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు శ్రీ తేజ్‌పై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ 69, 115(2), 318(2) సెక్షన్‌ల కింద అతడిపై కేసులు నమోదు చేశారు. శ్రీ తేజ్‌పై ఇదివరకే కూకట్‌పల్లి పీఎస్‌లో ఓ ఫిర్యాదు ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ భార్య అర్చనతో శ్రీ తేజ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ అక్రమ సంబంధం విషయం తెలిసిన సురేష్.. గుండెపోటుతో మరణించారు. ఈ ఘటనలో శ్రీ తేజ్‌పై కేసు నమోదైంది.

Also Read: Ram Gopal Varma: రామ్‌గోపాల్‌ వర్మ బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా!

శ్రీ తేజ్‌ తెలుగులో చాలా సినిమాలు చేశాడు. ప్రస్తుతం బడా సినిమాలలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’లో కూడా ఇతడు ఉన్నాడు. పుష్ప ది రైజ్‌, వంగవీటి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, ధమాకా, మంగళవారం, బహిష్కరణ వంటి సినిమాలతో శ్రీ తేజ్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.