Site icon NTV Telugu

MLA Arava Sridhar Case: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదు.!

Mla

Mla

MLA Arava Sridhar Case: తిరుపతి జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన పరిణామంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదైంది. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC)కు అందిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అందిన ఫిర్యాదును ఎన్‌హెచ్‌ఆర్‌సీ అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫార్వర్డ్ చేసింది. జిల్లా ఎస్పీకి చేరిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 22/2026గా నమోదు చేసిన ఈ కేసులో బీఎంఎస్ 318(2), 318(4), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Infinix: ఇన్ఫినిక్స్ Note 60 series వచ్చేస్తోంది.. స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్, 6,500 mAh బ్యాటరీ

ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు. ఈ అంశం పూర్తిగా వ్యక్తిగత విషయమని, దీనిని పార్టీకి ముడిపెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ వీడియోకు సంబంధించిన వ్యవహారంపై తాను కమిటీ ఎదుట ఆధారాలతో సమర్పించానని తెలిపారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఎదుట హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు చెప్పారు. తనకు జరిగిన అన్యాయాలను కూడా కమిటీకి వివరించినట్లు వెల్లడించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన పేర్కొన్నారు.

AC Coaches Missing: తప్పిపోయిందా? తప్పించుకొని పోయారా? రైలు నుంచి ఏసీ కోచ్ మిస్సింగ్..

అలాగే తనపై నమోదైన కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలిపారు. అవసరమైతే వంద కేసులు పెట్టినా పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version