NTV Telugu Site icon

Jagtial District: మహిళలను దొంగ చాటున ఫొటోలు తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కేటుగాడు.. కట్‌చేస్తే..

Case File

Case File

జన సమూహంలోని మహిళలను ఫొటోలు తీస్తూ… ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసిన జగిత్యాలకి చెందిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ అజ్ఞాత వ్యక్తి మహిళలను అసభ్యకరంగా ఫొటోలు తీస్తూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నాడు. గత కొంతకాలంగా పట్టణంలోని మార్కెట్, బస్టాండ్ తదితర ప్రాంతాలలో వివిధ అవసరాల నిమిత్తం వచ్చే మహిళల ఫొటోలు దొంగ చాటుగా తీస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు. ఓ బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తి పై కేసు నమోదు చేసిన టౌన్ సీఐ.. దర్యాప్తు ప్రారంభించారు.

READ MORE: Khammam: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీల మధ్య చిక్కుకున్న ట్రావెల్స్ బస్సు

ఇదిలా ఉండగా.. గతంలో కూడా.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం గ్రామంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు నడపుతున్న యువకుడు.. ఎకీన్‌పూర్, సంగెం గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ వాటర్‌ బబుల్స్‌ సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళల ఫొటోలను మొబైల్‌ ఫోన్‌లో దొంగచాటుగా చిత్రీకరించాడు. సుమారు ఏడాదిగా దాదాపు 400 మంది మహిళలను ఫొటోలు తీసినట్లు సమాచారం. ఇలా తీసిన ఫొటోలను ఉమ పేరిట ఎక్స్ (ట్విటర్‌) ఖాతా తెరిచి అందులో అప్‌లోడ్‌ చేశాడు. వీటిని చూసిన సంగెం గ్రామస్థులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఆ వెంటనే కోరుట్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఫొటోలు అశ్లీలంగా లేవని తెలిసింది.

READ MORE: CWC Recruitment 2025:సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. నేడే ఆఖరి రోజు

Show comments