Director Ranjith: లైంగిక వేధింపుల ఆరోపణలు.. డైరెక్టర్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు!
- బెంగాలీ నటి ఫిర్యాదు
- డైరెక్టర్ రంజిత్‌పై కేసు నమోదు
- చీకటి కోణాన్ని హేమ కమిటీ బహిర్గతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Police register case against Director Ranjith: ప్రముఖ మలయాళ డైరెక్టర్, నిర్మాత రంజిత్‌పై కేసు నమోదు అయింది. ఓ బెంగాలీ నటి ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు సోమవారం ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. రంజిత్‌పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసినట్లు కొచ్చి పోలీస్ కమిషనర్ ఎస్ శ్యాంసుందర్ తెలిపారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం హేమా కమిటీకే ఈ కేసును అప్పగించనున్నారు.
సినిమా షూటింగ్ సమయంలో రంజిత్ తనను లైంగికంగా వేధించాడని, ఉద్దేశపూర్వకంగానే తనను తాకేవాడని బెంగాలీ నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009లో పాలెరి మాణిక్యం సినిమా ప్రీ ప్రొడక్షన్ సమయంలో రంజిత్ తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని ఆమె చెప్పుకొచ్చారు. కేరళ ప్రభుత్వంకు హేమ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత మరో నటి కూడా తన చేదు అనుభవాలను చెప్పారు.
Also Read
- UCC Bill: 'ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు'.. సీఎం సంచలన ప్రకటన..
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Pawan Kumar Chandana: మ్యాథ్స్‌లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
- Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
Also Read: SSMB 29: వెయ్యి కోట్లతో కౌంట్‌డౌన్.. మహేష్-రాజమౌళి సినిమా అందుకే ఆలస్యం?
తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసిన డైరెక్టర్ రంజిత్.. ఆదివారం కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. బెంగాలీ నటి కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్‌కు సోమవారం ఫిర్యాదు చేయడంతో రంజిత్‌పై కేసు నమోదైంది. మలయాళ ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని హేమ కమిటీ బహిర్గతం చేసింది. కొందరు ప్రముఖులు ఆర్టిస్టులను బానిసల కన్నా హీనంగా చూస్తారని, మహిళా ఆర్టిస్టులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలో పలువురు నటీనటులు తమకు ఎదురైన చేదు అనుభవాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నారు.
తాజావార్తలు
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్‌లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!