NTV Telugu Site icon

Harish Rao: ఎమ్మెల్యే హరీష్ రావుపై మరో కేసు నమోదు!

Harish Rao

Harish Rao

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌ రావుపై కేసు నమోదైంది. చక్రధర్‌ గౌడ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. హరీష్ రావుతో పాటు ఇటీవల జైలు నుండి విడుదలైన ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని చక్రధర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హరీశ్‌ రావు, వంశీ కృష్ణ, సంతోష్‌ కుమార్‌, పర్శరాములుపై కేసు నమోదైంది.

ఎఫ్ఐఆర్‌లో ఏ-2గా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు పేరును బాచుపల్లి పోలీసులు చేర్చారు. హరీష్ రావుపై 351 (2) R/W 3, (5) BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా వంశీ కృష్ణ, ఏ-3గా సంతోష్ కుమార్, ఏ-4గా పర్శరాములు ఉన్నారు.