Kanguva : ‘కంగువా’ నిర్మాతపై కోర్టులో కేసు.. అసలేమైందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanguva : స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
Read Also:Israel–Hamas war: హమాస్ చివరి కీలక నేత హతం.. ధృవీకరించిన ఇజ్రాయెల్
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఈ సినిమాలో సూర్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఇఫ్పుడు ఈ చిత్ర నిర్మాతపై మద్రాస్ హై కోర్టులో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్… జ్ఞానవేల్ రాజా తమకు దాదాపు రూ.100 కోట్లు బకాయి పడ్డారని.. తమకు పూర్తి మొత్తం చెల్లించిన తరువాతే ‘కంగువా’ చిత్రాన్ని రిలీజ్ చేయాలంటూ వారు తమ కేసులో పేర్కొన్నారు. జ్ఞానవేల్ రాజా గతంలో వరుస పరాజయాలను చవిచూశారు. తమ నుండి రూ.99.22 కోట్లు జ్ఞానవేల్ తీసుకున్నాడని.. ఇంకా రూ.45 కోట్ల మేర చెల్లించాలని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ డిమాండ్ చేస్తోంది. అయితే, ఈ కేసుపై మద్రాసు కోర్టు నవంబర్ 7న వాదనలు వినేందుకు అంగీకరించింది. మరి ఈ ప్రభావం ‘కంగువా’ రిలీజ్‌పై ఎంతవరకు పడుతుందో చూడాలి. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.
Read Also:Nagarjuna Sagar to Srisailam Tour: ప్రారంభమైన నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్ ప్రయాణం…
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!