NTV Telugu Site icon

Kanguva : ‘కంగువా’ నిర్మాతపై కోర్టులో కేసు.. అసలేమైందంటే ?

Suriya Kanguva

Suriya Kanguva

Kanguva : స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

Read Also:Israel–Hamas war: హమాస్ చివరి కీలక నేత హతం.. ధృవీకరించిన ఇజ్రాయెల్

ఈ సినిమాలో సూర్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఇఫ్పుడు ఈ చిత్ర నిర్మాతపై మద్రాస్ హై కోర్టులో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్… జ్ఞానవేల్ రాజా తమకు దాదాపు రూ.100 కోట్లు బకాయి పడ్డారని.. తమకు పూర్తి మొత్తం చెల్లించిన తరువాతే ‘కంగువా’ చిత్రాన్ని రిలీజ్ చేయాలంటూ వారు తమ కేసులో పేర్కొన్నారు. జ్ఞానవేల్ రాజా గతంలో వరుస పరాజయాలను చవిచూశారు. తమ నుండి రూ.99.22 కోట్లు జ్ఞానవేల్ తీసుకున్నాడని.. ఇంకా రూ.45 కోట్ల మేర చెల్లించాలని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ డిమాండ్ చేస్తోంది. అయితే, ఈ కేసుపై మద్రాసు కోర్టు నవంబర్ 7న వాదనలు వినేందుకు అంగీకరించింది. మరి ఈ ప్రభావం ‘కంగువా’ రిలీజ్‌పై ఎంతవరకు పడుతుందో చూడాలి. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.

Read Also:Nagarjuna Sagar to Srisailam Tour: ప్రారంభమైన నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్ ప్రయాణం…

Show comments