NTV Telugu Site icon

Viral Video: స్పెయిన్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోతున్న కార్లు, వాటిపై జనాలు.. వీడియో వైరల్

Spain

Spain

Flash Floods Hit Spain: ఐరోపా దేశమైన స్పెయిన్‌ను వరదలు అతలాకుతలం చేస్తు్న్నాయి. తీవ్రమైన తుఫాను ప్రభావంతో కుండపోత వర్షాల వల్ల జరాగోజా నగరంలో వరద బీభత్సం నెలకొంది. భారీ వర్షం కారణంగా అనేక వీధులు జలమయమయ్యాయి. తాజాగా, అక్కడ ఓ రహదారిని వరద ముంచెత్తగా, కార్లు సైతం వెనక్కి కొట్టుకుపోతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కార్లలోని వారు నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిని ఆ వీడియోలో చూడొచ్చు. కొంతమంది డ్రైవర్లు వారి కార్లలో చిక్కుకున్నారు.

Also Read: Viral Video: భార్యాభర్తల బంధం అంటే ఇదేనేమో.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో చాలా మంది ప్రజలు తమ వాహనాల పైకప్పుపై కూర్చుని, వరద నీటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సమీపంలోని చెట్లపైకి ఎక్కినట్లు కనిపించింది. రోడ్డుపైకి దూసుకొచ్చిన వరద నీరు కార్లను ఆటబొమ్మల్లా నెట్టుకుంటూ వెళ్తుండగా, ప్రజలు కార్ల టాప్ పైకి చేరుకుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. వారిలో కొందరు వరద ఉద్ధృతి కారణంగా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. బాధిత వ్యక్తులను రక్షించడానికి, పరిస్థితిని నియంత్రించడానికి అత్యవసర రెస్క్యూ బృందాలను అధికారులు పంపారు.

 

అనవసరమైన ప్రయాణాలను నివారించాలని, వరద ప్రాంతాల గుండా వెళ్లవద్దని నివాసితులను జరాగోజాలోని పోలీసులు హెచ్చరించారు. ఎక్స్‌ప్రెస్ ప్రకారం, వ్యక్తులు తమ కార్లలో చిక్కుకుపోయిన తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో పార్క్ వెనిసియా ఒకటి. పెద్దఎత్తున ఆస్తి నష్టం జరిగినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి మరణాలు లేదా తప్పిపోయిన వ్యక్తులు నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు. జరాగోజా మేయర్, నటాలియా చుయెకా కుండపోత వర్షం వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసి, నిర్దిష్ట కొలతలను అందించారు. పది నిమిషాల్లో, చదరపు మీటరుకు 20 లీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక గంటలో అది చదరపు మీటరుకు 56లీటర్లకు చేరుకుంది. ఈ తీవ్రమైన తుఫాను వరదలకు దారితీసిందని, ముఖ్యంగా పార్క్ వెనిసియా ప్రాంతంలో, అసాధారణమైన వర్షపాతం కారణంగా వరదలు నగరంలోని ఇతర ప్రాంతాలను కూడా ప్రభావితం చేశాయని చుయెకా చెప్పారు. వీలైనంత త్వరగా సాధారణ స్థితికి రావడమే నగరం లక్ష్యమని ఆమె నొక్కి చెప్పారు.