NTV Telugu Site icon

Viral Video: ప్లాస్టిక్ బాటిల్ ఎత్తుకెళ్తున్న పెద్దపులి.. వీడియో వైరల్

Tiger

Tiger

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేసే వీడియోలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. పాములు, ఏనుగులు, పులుల వీడియోలు ఇలాంటివి నెటిజన్స్ ఎక్కువగా చూస్తున్నారు. కొంచెం కొత్తదనంగా కనిపిస్తే చాలు.. ఏ వీడియో అయినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. తాజాగా పెద్ద పులికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

Karanam Balaram: చంద్రబాబుకు చీరాల ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్..

ఆ వీడియాలో.. మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్‌లో ఒక పులి తన నోటిలో ప్లాస్టిక్ బాటిల్‌ను పట్టుకుని తనతో పాటు తీసుకువెళుతున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ అది నీళ్లు తాగడానికి కాదు.. దీన్ని బట్టి చూస్తే కాలుష్యం నగరాల్లోనే కాదు, అడవుల్లో కూడా పెరిగిపోతుందని అర్థమవుతుంది. దీంతో ప్లాస్టిక్ అడవి జంతువులకు హాని కల్గిస్తున్నాయి. దీంతో జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అడవులు అంతరించిపోయి కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దరిమిలా వాతావరణంలో అసాధారణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Ayodhya Temple: ‘‘రాబోయే 1000 ఏళ్లు భారత్‌లో రామరాజ్యం’’.. రామ మందిరంపై బీజేపీ తీర్మానం..

వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్ దీప్ కతికర్ ఈ వీడియోను షూట్ చేసి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో 29 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేకాకుండా.. కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. చెరువులో బాటిల్ ఉండటంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఫ్లాస్టిక్ అడవిలోకి వెళ్లిందంటే మనం వాడకం ఎంత ఎక్కువైందో ఈ వీడియోను చూస్తే అర్థమవుతోందని అంటున్నారు.

Show comments