Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cardiac Arrest: సినీ దిగ్గజం నానా పటేకర్ నిన్న ఉదయాన్నే కన్నుమూసిన విషయం తెలిసిందే. ‘కార్డియాక్ అరెస్ట్’ రావడంతో 75 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. అసలు ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది ఎంత ప్రమాదకరమైనదంటే.. వెంటనే సరైన చికిత్స అందకపోతే మనిషి బతికే అవకాశాలు దాదాపు శూన్యం. ఎంతో ఆరోగ్యంగా, నవ్వుతూ తుళ్లుతూ ఉండే వ్యక్తి కూడా క్షణాల్లో కుప్పకూలిపోవడం, నాడి ఆగిపోవడం, కళ్లు మూతలు పడటం, శ్వాస అందకపోవడం వంటివి కార్డియాక్ అరెస్ట్ ప్రధాన లక్షణాలు. వీటిని అస్సలు తేలికగా తీసుకోకూడదు. ఇది గుండెపోటు (హార్ట్ ఎటాక్) కంటే చాలా భయంకరమైనది, ప్రాణాంతకమైనది. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు గుండెలోని ఎలక్ట్రికల్ వ్యవస్థ పనిచేయడం ఆగిపోతుంది. దాంతో గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా నిలిచిపోయి, మెదడుతో పాటు మిగతా అవయవాలకు రక్తం సరఫరా కావడం ఆగిపోతుంది. మన దేశంలో జరిగే మొత్తం మరణాల్లో దాదాపు 10 శాతం మరణాలు ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ వల్లే జరుగుతున్నాయని, గుండె సంబంధిత మరణాల్లో సగం దీని వల్లేనని గణాంకాలు చెబుతున్నాయి.
హాస్పిటల్ బయట ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ వస్తే వారు బతికే అవకాశం కేవలం 8 నుండి 10 శాతం మాత్రమే ఉంటుంది. సమయం గడిచే కొద్దీ, అంటే ప్రతి ఒక్క నిమిషానికి బాధితుడు బతికే అవకాశాలు 7 నుంచి 10 శాతం తగ్గిపోతాయి. 10 నిమిషాలు దాటితే మెదడు శాశ్వతంగా పనిచేయడం ఆగిపోతుంది (బ్రెయిన్ డెడ్). ఆ సమయంలో ఏ వైద్య సహాయం అందకపోతే బతికే అవకాశం 1 శాతం కంటే తక్కువగా ఉంటుంది. కానీ, వెంటనే స్పందించి పక్కనున్న వారు సీపీఆర్ (CPR) ఇస్తే ఆ మనిషి ప్రాణాలు నిలిచే అవకాశం 40 నుంచి 50 శాతానికి పెరుగుతుంది. అందుకే ఇలాంటి అత్యవసర సమయంలో టైమింగ్ చాలా ముఖ్యం. కార్డియాక్ అరెస్ట్ వచ్చిన 1-2 నిమిషాల్లోనే సరైన పద్ధతిలో సీపీఆర్ ఇస్తే బాధితుడు కోలుకునే అవకాశాలు 40 నుంచి 50 శాతానికి పెరుగుతాయి. అదే హార్ట్ ఎటాక్ కేసుల్లో అయితే ఈ సర్వైవల్ రేట్ 60 నుంచి 90 శాతం వరకు ఉంటుంది. ఒకవేళ సీపీఆర్‌తో పాటు 3-5 నిమిషాల్లో ఏఈడీ (AED – ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్) మిషన్ ద్వారా షాక్ ఇవ్వగలిగితే బతికే అవకాశాలు ఏకంగా 50 నుంచి 70 శాతానికి చేరుకుంటాయి. ఏఈడీ అంటే గుండె కొట్టుకోవడాన్ని మళ్లీ సాధారణ స్థితికి తెచ్చే ఎలక్ట్రికల్ మిషన్.
Also Read
- Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
- LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
- Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
- Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
మీ కళ్ల ముందే ఎవరైనా సడన్‌గా కిందపడిపోతే వెంటనే ఏం చేయాలో తెలిసుండటం చాలా అవసరం. ముందుగా వారి భుజాలు తట్టి ‘మీరు బాగున్నారా?’ అని గట్టిగా అడగండి. వారి నుంచి ఎలాంటి స్పందనా లేకపోయినా, శ్వాస ఆడకపోయినా లేదా విచిత్రంగా మూలుగుతున్నట్లు శ్వాస తీసుకుంటున్నా అది కార్డియాక్ అరెస్ట్ అని గ్రహించాలి. వెంటనే మీ చేతులతో సీపీఆర్ ఇవ్వడం ప్రారంభించాలి. అదే సమయంలో పక్కనున్న ఎవరినైనా అంబులెన్స్‌కు ఫోన్ చేయమని, వీలైతే దగ్గరలో ఉన్న ఏఈడీ మిషన్‌ను తీసుకురమ్మని చెప్పాలి. ఈ సీపీఆర్ (హ్యాండ్స్-ఓన్లీ సీపీఆర్) ఎలా ఇవ్వాలంటే.. మొదట బాధితుడిని నేలపై లేదా గట్టిగా ఉండే సమాంతర ఉపరితలంపై తిన్నగా పడుకోబెట్టాలి. మీ ఒక అరచేతిని బాధితుడి ఛాతీకి సరిగ్గా మధ్యలో ఉంచి, రెండో అరచేతిని దానిపై పెట్టి వేళ్లను ఒకదానిలో ఒకటి లాక్ చేసుకోవాలి. చేతి మోచేతులను అస్సలు వంచకుండా నిటారుగా ఉంచి, మీ శరీర బరువుతో ఛాతీని 2 నుండి 2.5 అంగుళాల లోతుకు గట్టిగా నొక్కాలి. ఇలా నిమిషానికి 100 నుంచి 120 సార్లు నొక్కే వేగంతో చేస్తూనే ఉండాలి. అంబులెన్స్ లేదా డాక్టర్లు వచ్చే వరకు, లేదా ఆ వ్యక్తికి మళ్లీ శ్వాస వచ్చి కదలికలు మొదలయ్యే వరకు ఆగకుండా సీపీఆర్ ఇస్తూనే ఉండాలి. ఈ ఒక్క చిన్న జాగ్రత్త ప్రాణాపాయంలో ఉన్న ఒక మనిషిని తిరిగి బతికించగలదు.
తాజావార్తలు
-
GREEN CRACKERS: ఈ దీపావళికి ఊపిరి పీల్చుకోవడం సాధ్యమేనా?
-
SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ కంటే 5-6 రెట్లు ఎక్కువ.. ‘వారణాసి’పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
-
SS Rajamouli: చేతిలో ఎన్నో ఆఫర్లు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి బిగ్ ప్లాన్!
-
Saikrishna Case: కృష్ణలంక పీఎస్‌లో సీబీఐ విచారణ.. అర్ధరాత్రి 12 గంటల తర్వాతే స్టేషన్ నుంచి వెళ్లిన అధికారులు
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!