Site icon NTV Telugu

Cardamom Benefits: నిద్రలేమి సమస్యలతో ఇబ్బందులా? అయితే ఇలా ట్రై చేయండి!

Cardamom

Cardamom

Cardamom Benefits: రోజంతా కాస్పది పనిచేసి అలసిపోయి రాత్రి మంచంలో పడుకున్నా నిద్ర రాకపోవడం, భోజనం తర్వాత ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడటం.. ఇవన్నీ చాలా మందికి సాధారణ సమస్యలే. కానీ వీటి పరిష్కారం ఎక్కడో కాదు, మన వంటగదిలోనే దాగి ఉంది. అదే యాలకులు (Green Cardamom). వంటకాలకు సువాసన, రుచి పెంచే గింజలు ఆరోగ్యానికి కూడా అద్భుతమైన మంత్రంలా పనిచేస్తాయి. ప్రతి రాత్రి భోజనం తర్వాత కేవలం రెండు యాలకులు నమిలితే మీ శరీరానికి అనేక విధాలుగా లాభం కలుగుతుంది. మరి ఆ లాభాలేంటో చూద్దామా..

ఆధునిక ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయి. యాలకులు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్ప్రేరేపిస్తాయి. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి ఇబ్బందులను తగ్గించి కడుపు తేలికగా అనిపించేలా చేస్తాయి. భోజనం తర్వాత యాలకులు నమలడం వల్ల నోటి దుర్వాసన తక్షణమే తగ్గుతుంది. యాలకుల సువాసన నోరు తాజాగా ఉంచి, బ్యాక్టీరియాను చంపే యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది.

Baahubali Epic : బాహుబలి-3పై నిర్మాత క్లారిటీ.. సర్ ప్రైజ్..

అలాగే నిద్ర పట్టకపోవడం వల్ల ఒత్తిడి, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. యాలకుల్లో ఉండే సహజ రసాయనాలు సెరోటోనిన్ స్థాయిలను పెంచి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. దీని వలన నిద్ర సహజంగా, ప్రశాంతంగా వస్తుంది. అంతేకాకుండా యాలకుల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును సంతులనం చేయడంలో సహాయపడతాయి. రాత్రి భోజనం తర్వాత యాలకులు నమలడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

Shocking News: ఎవడు సుధా వీడు.. లవర్ ను చంపి… సమాధిపైనే రెండ్రోజులు

ఇకపోతే బరువు తగ్గాలని ప్రయత్నించే వారు రాత్రి యాలకులు తినడం అలవాటు చేసుకోవచ్చు. యాలకుల్లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీర జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి కొవ్వును కరిగించేందుకు సహాయాన్ని పెంచుతాయి. అలాగే శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటకు పంపి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం, నిద్రలేమి, అధిక బరువు, నోటి దుర్వాసన ఇవన్నీ మన రోజువారీ జీవితంలో ఇబ్బంది కలిగించే సమస్యలు. కానీ రాత్రి భోజనం తర్వాత కేవలం రెండు యాలకులు నమలడం ద్వారా ఈ సమస్యలను సహజంగా దూరం పెట్టవచ్చు. ఇది చిన్న అలవాటు అయినా, ఫలితాలు మాత్రం పెద్దవి.

Exit mobile version